నష్టాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు

desi market sensex

ఈవారం దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 7 నెలల కనిష్ట స్థాయికి పడిపోగా.. నిఫ్టీ 10వేల పాయింట్ల ఎగువన ముగిసింది. వారం మొత్తం మీద సెన్సెక్స్‌ 966 పాయింట్లు, నిఫ్టీ 274, బ్యాంక్‌ నిఫ్టీ 665 పాయింట్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో క్షీణత, దేశీయంగా లిక్విడిటీకి సంబంధించిన ఆందోళనల నేపథ్యంలో సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. రూపాయి పతనం కూడా మార్కెట్‌పై ప్రభావం చూపింది. ప్రధానంగా ఐటీ, బ్యాంకింగ్‌ విభాగాల్లో అమ్మకాలు పోటెత్తి ఆ సూచీలు దిగజారడం మార్కెట్‌ను భారీ క్షీణత దిశగా నడిపింది. బజాజ్‌ ఫైనాన్స్‌, ఐబీ హౌజింగ్‌ ఫైనాన్స్‌, హెచ్‌పీసీఎల్‌, భారతి ఎయిర్‌టెల్‌, ఐఓసీలు ఈ వారం టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. అయితే ఈవారం యెస్‌ బ్యాంక్‌ 17శాతం, గ్రాసీం 14 శాతం, సన్‌ ఫార్మా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 9 శాతం చొప్పున నష్టపోయాయి.

Also Read : అగ్రనిర్మాత ఆకస్మిక మరణం

ఇక ఈవారం మార్కెట్లపై విశ్లేషణ, అలాగే వచ్చేవారం మార్కెట్లు ఎలా ఉండొచ్చు.. మీడియం టర్మ్‌లో ఏఏ సెక్టార్స్‌లో పెట్టుబడులు పెట్టొచ్చు.. అనే అంశంపై ఫండమెంటల్‌ ఎనలిస్ట్‌ బాలా గారి విశ్లేషణను ఇప్పుడు చూద్దాం.

వారం రోజుల్లో గడువు తీరిపోయే సెన్సెక్స్‌ ఫిఫ్టీ ఎఫ్‌అండ్‌ఓ సిరీస్‌ను బీఎస్‌ఈ నిన్నటి నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఈ విభాగంలో మొత్తం 7 కాంట్రాక్టులను ప్రారంభించినట్టు బీఎస్‌ఈ తెలిపింది. నెలవారీ కాంట్రాక్టుల గడువు తీరే వారం మినహాయించి, ప్రతి వారం గురువారం రోజున ఈ కాంట్రాక్టుల గడువు తీరిపోనుంది. ఒకవేళ గురువారం సెలవు ఉంటే ఆ ముందు ట్రేడింగ్‌ రోజున కాంట్రాక్టు గడువు తీరిపోతుంది. పాత కాంట్రాక్టు గడువు తీరాక ఆ తర్వాతి ట్రేడింగ్‌ రోజు నుంచి మళ్లీ కొత్త ఎఫ్‌అండ్‌ఓ సిరీస్‌ ట్రేడింగ్‌ మొదలవుతుందని బీఎస్‌ఈ ప్రకటించింది.

ఆసియాలోనే అతిపెద్ద కాన్ఫరెన్స్‌.. ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌ విజయవంతంగా ముగిసింది. మొద‌టి హ్యూమ‌నాయిడ్ రోబో సోఫియా ఈ ఫెస్టివల్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. విద్యార్ధులకు – పారిశ్రామిక రంగానికి మధ్య వారధిగా నిలుస్తూ పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపడుతోన్న టీవీ5కు ఈ ఫిన్‌టెక్‌ వేదికలో అరుదైన గౌరవం లభించింది.

సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. హైద్రాబాద్‌ లాంటి నగరంలో అయితే అది నిజంగా ఒక కలే. ఎంత బడ్జెట్‌లో ఇల్లు దొరుకుతుంది..? ఏ ప్లేస్‌ అనుకూలం..? ఎలా కొనాలి లాంటి సమస్యలు.. సందేహాలు చాలానే ఉంటాయ్. వాటిని తీర్చడానికి వచ్చే నెల 2 నుంచి హైదరాబాద్‌లో తొమ్మిదో ఎడిషన్‌ ప్రాపర్టీ షోను ట్రెడా నిర్వహిస్తోంది.

మరో అంతర్జాతీయ సదస్సుకి హైద్రాబాద్‌ వేదికకానుంది. సీఐఐ- ఐజీబీసీ నిర్వహించనున్న గ్రీన్‌ బిల్డింగ్‌ కాంగ్రెస్‌ ఈవెంట్‌కి భాగ్యనగరం అతిధ్యం ఇవ్వనుంది. నవంబర్‌ ఒకటి నుంచి 3వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ ఆఫైర్స్ మినిస్టర్‌ హర్‌దీప్‌ సింగ్‌ పూరీ హాజరుకానున్నారు. అలాగే దేశ- విదేశాలకు చెందిన 2 వేలమంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. నిర్మాణ రంగంలో కొత్త టెక్నాలజీలు వచ్చిన తర్వాత గ్రీనరీకి ప్రాధాన్యం పెరిగిందని.. కార్పొరేట్‌ సంస్థలతో పాటు సొంతంగా ఇల్లు నిర్మించుకునేవారు కూడా ఎకో ఫ్రెండ్లీ పద్దతులు పాటించడానికి మొగ్గు చూపుతున్నారని ఐజీబీసీ హైద్రాబాద్‌ ఛాప్టర్‌ ఛైర్మన్‌ శేఖర్‌ రెడ్డి తెలిపారు.