భారత్‌కు విండీస్ షాక్‌.. ఛేజింగ్‌లో చేతులెత్తేసిన టీమిండియా

భారత టూర్‌లో వెస్టిండీస్ ఎట్టకేలకు తొలి విజయాన్ని రుచి చూసింది. పుణే వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియాకు షాకిచ్చింది. ఆసక్తికరంగా సాగిన పోరులో కరేబియన్ టీమ్‌ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 283 పరుగులు చేసింది. ఒక దశలో 150 కూడా దాటదనుకున్న ఆ జట్టు హోప్‌ సూపర్ ఇన్నింగ్స్‌తో కోలుకుంది.

Also Read : క్రికెటర్ సంచలన నిర్ణయం..

ఛేజింగ్‌లో భారత్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. కోహ్లీ తప్పిస్తే… మిగిలిన బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలవలేదు. తన సూపర్ ఫామ్ కొనసాగించిన కోహ్లీ 38వ సెంచరీతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. కోహ్లీ 107 పరుగులకు ఔటయ్యాక.. టెయిలెండర్లు చేతులెత్తేయడంతో భారత్‌ 240 పరుగులకు ఆలౌటైంది. దీంతో సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి.