దీపిక రికార్డు బ్రేక్ చేసిన ప్రభాస్ హీరోయిన్!

కంగన ఈ పేరు వింటే చాలు యూత్‌లో వైబ్రేషన్స్ పుట్టుకొస్తాయి. ఏక్ నిరంజన్ మూవీలో ప్రభాస్‌తో జత కట్టిన ఈ భామ తన అందంతో కుర్రకారును గిలిగింతలు పెట్టింది. ఒకవైపు తన అందం, మరోవైపు తన అద్భుతమైన నటనా ప్రదర్శనతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఎప్పటికప్పుడు వైవిద్యభరితమైన చిత్రాల్లో నటిస్తూ చిత్ర పరిశ్రమల్లో తన కంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది. ప్రస్తుతం ‘మణికర్ణిక’ మూవీలో.. రాణీ ఝాన్సీలక్ష్మీ బాయిగా తన వీరత్వాన్ని ప్రదర్శించేందుకు సిధ్ధమైంది. అయితే ఈ మూవీ కోసం కంగన రూ.14కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు బాలీవుడ్ టాక్. సాధారణంగా ఆమె రూ.5 కోట్లు నుంచి రూ.6 కోట్లు తీసుకుంటుందట. అయితే ఇప్పుడు డబుల్ పారితోషికం తీసుకోవటం బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది.

గతంలో దీపికా పదుకునే ‘పద్మావత్’ మూవీ కోసం తీసుకున్న పారితోషికం కంటే ఎక్కువ. ఆ సినిమాలో నటించిన షాహిద్, రణవీర్ పారితోషికం కంటే దీపికా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవటం అప్పట్లో సంచలనంగా మారింది. ఇప్పుడు దీపిక రికార్డు బ్రేక్ చేస్తూ కంగన ఇంత పారితోషికం తీసుకోవటం హాట్ టాపిక్‌గా మారింది.

మెగా ఫ్యామిలీలో దెయ్యాలు..!!

ఈ మూవీ దర్శకుడు క్రిష్ ‘యన్.టి.ఆర్’ బయోపిక్ లో బిజీగా ఉండటంతో ‘మణికర్ణిక’ మూవీ చివరి షెడ్యూల్‌ను కంగనా డైరెక్ట్ చేశారు. జనవరి 25న ‘మణికర్ణిక’ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తోంది.