ఆడవారికి ‘అల్లం టీ’.. పీరియడ్స్‌లో బాధించే..

ఉదయాన్నే ఓ కప్పు వేడి వేడి చాయ్ గొంతులో పడితే ఉత్సాహంగా పనిచేసుకోవచ్చు. దాంట్లో కొద్దిగా అల్లం జోడిస్తే ఆరోగ్యం కూడా. అల్లంలో ఉన్న విటమిన్ సి, మెగ్నిషియం, మినరల్స్ వంటివి శరీరానికి మేలు చేస్తాయి.
చాలా మందికి ప్రయాణ సమయాల్లో కడుపులో తిప్పినట్లు ఉంటుంది. కొందరికి వాంతులు కూడా అవుతుంటాయి. అలాంటి వారు ప్రయాణానికి ముందే ఓ కప్పు అల్లం టీ తీసుకుంటే ఉపశమనం ఉంటుంది.
జీర్ణ సమస్యలతో బాధ పడే వారు కూడా అల్లం టీ తీసుకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్ త్రేన్పులు వంటి సమస్యలనుంచి దూరంగా ఉండవచ్చు.
ముఖ్యంగా మహిళలు పీరియడ్స్ సమయంలో ఎదుర్కునే సమస్యలను అల్లం టీ దూరం చేస్తుంది. రోజూ తాగడం వలన పీరియడ్స్ కూడా రెగ్యులర్‌గా వస్తాయి. ఆ సమయంలో వచ్చే నొప్పిని దూరం చేస్తుంది.

40 దాటితే నడుము నోప్పి, కీళ్ల నొప్పులు బాధిస్తుంటాయి. అల్లంటీని రోజూ తీసుకుంటే సమస్య చాలా వరకు తగ్గుముఖం పడుతుంది.
సీజనల్ వ్యాధులకు అల్లం టీతో చెక్ పెట్టవచ్చు. జలుబు, ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి సమస్యలకు అల్లం టీ అద్భుతంగా పనిచేస్తుంది.
మెరగైన రక్తప్రసరణకు అల్లం టీ బాగా పనిచేస్తుంది.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
శరీరం ఒత్తిడికి గురైనప్పుడు, మానసిక ప్రశాంతతకోసం అల్లంటీని తీసుకుంటే ఉపయోగం ఉంటుంది.
అధిక బరువుని తగ్గించే శక్తి కూడా అల్లంటీకి ఉంది. చెడు కొలెస్ట్రాల్‌ని దూరం చేసి, గుండె సంబంధిత సమస్యలు రాకుండా నివారిస్తుంది.

800 యూనివర్సీటీలు.. ఉచితంగా 10 వేల కోర్సులు..
మంచిది కదా అని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. అల్లం అతిగా తీసుకుంటే కడుపులో మంట వస్తుంది. రక్తపోటు కూడా బాగా తగ్గిపోతుంది. ‘అతి సర్వత్రా వర్జయేత్‌’ అని పెద్దలు ఊరికే అనలేదు మరి. తక్కువ మోతాదులో తీసుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా తీసుకోవాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. సమస్య వచ్చినప్పుడు కాకుండా ముందు నుంచే ఆచరిస్తే ఉపయోగం ఉంటుంది.