ఇవి పిట్టలు కాదు.. మరేంటి? గుర్తుపట్టగలరా?

సృష్టిలో ఎన్నో వింతలు మరెన్నో విశేషాలు. ప్రకృతి అనే అందమైన కాన్వాసు మీద కుంచెతో గీసినట్లుండే చిత్రాలు కొన్నైతే మరికొన్ని పూలు, పక్షులు, జంతువులు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. కొన్ని మొక్కలు, పక్షులు స్వీయ రక్షణ కోసం రంగులు మారుస్తుంటాయి. కొన్ని పువ్వులు ముట్టు కుంటే ముడుచుకు పోతుంటాయి. పశ్చిమ మహారాష్ట్రలో కనిపించే ఈ పూల మొక్కలకు పూసిన ‘అంబాలీ’ పువ్వులు అచ్చంగా పక్షులను గుర్తుకు తెస్తున్నాయి. తోటలోని మొక్కలన్నింటికీ పూసిన పువ్వులు ఒకేలా ఉన్నా ఒక మొక్కకి పూసిన పువ్వులు అందమైన పక్షుల్లా అలరిస్తున్నాయి. చూడడానికి వింతగా కనిపించడంతో ప్రకృతి ప్రేమికులు ఈ అరుదైన దృశ్యాన్ని కెమేరాలో బంధించారు. ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.

బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం.. ప్రాణాలు కోల్పోయిన ఇంటర్ విద్యార్ధిని