ఘోర విమాన ప్రమాదం.. 200 మంది ప్రయాణీకులు..

ఇండోనేషియాలో విమాన ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. లయన్ ఎయిర్‌కు చెందిన JT 610 విమానం టేకాఫ్ అయిన కాసేపటికే సముద్రంలో కూలిపోయింది. జకార్తా నుంచి పాంగ్‌కల్ పినాంగ్‌కు బయలుదేరిన విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. ఫ్లైట్ సిబ్బందితో కలిసి మొత్తం 188 మంది కూడా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. రాజధాని జకార్తా నుంచి ఉదయం 6 గంటల 20 నిమిషాలకు ఫ్లైట్ బయలుదేరింది. 6 గంటల 33 నిమిషాలకు ATCతో సంబంధాలు తెగిపోయాయి. కాసేపటికే అది కూలినట్టు నిర్థారించారు.

ప్రచారంలో ఉద్రిక్తతలు.. తొలిరోజే మంత్రికి నిరసన సెగ

విమాన ప్రమాదం విషయం తెలిసిన వెంటనే అది కూలిన చోటు గుర్తించేందుకు ఆపరేషన్ మొదలయ్యింది. పశ్చిమ జావా ప్రాంతంలో మిస్సైనట్టు తేలడంతో.. నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ అక్కడికి ప్రత్యేక బృందాల్ని పంపారు. ఈ బోయింగ్ 737 విమానంలో 210 మంది ప్రయాణించొచ్చు. ఇవాళ ఉదయం 180 మంది ప్రయాణికులతో గమ్యస్థానానికి బయలుదేరింది. కాసేపటికే ఈ దుర్ఘటన జరగడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఘటన జరిగి ఇప్పటికి చాలా సమయం అయినందున.. ఇందులో ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం కనిపించడం లేదు.