కొక్కొరోకో.. కోడి ధర కొండెక్కింది..

మాంసాహార ప్రియలకు అత్యంత ఇష్టమైన కోడి ధర అమాంతం పెరిగిపోయింది. మటన్ కొనాలంటే బోలెడు రేటు.. పోనీ చికెన్‌తో సరిపెట్టుకుందామంటే అది కూడా అందుబాటులో లేకుండా పోతోంది. కర్నాటకలోని చిత్ర దుర్గం, బళ్లారి ప్రాంతాలనుంచి కోళ్లను చికెన్ సెంటర్లకు సరఫరా చేస్తుంటారు. అయతే ఫారంలో ధరలకు, చికెన్ సెంటర్లో ధరలకు పొంతన ఉండడం లేదు. ఫారంలో కిలో కోడి రూ.99 లు ఉంటే బయట రూ.130 నుంచి రూ.140 వరకు వుంది. మళ్లీ దానికి జీఎస్టీ కలిపి విక్రయిస్తున్నారు. ఉత్పత్తి తగ్గడం డిమాండ్ పెరగడం కూడా రేట్లు పెరగడానికి కారణంగా చూపిస్తున్నారు వ్యాపారస్తులు.

ధరలు పెరగడంతో చికెన్ కొనేవారి సంఖ్య తగ్గిందంటున్నారు. ఆది, మంగళ, శుక్రవారాల్లో వ్యాపారం జోరుగా సాగేదని, అయితే ధరలు పెరగడంతో మాంసం విక్రయాలు సగానికి పడిపోయాయని పరిస్థితి ఇలాగే కొనసాగితే మాంసం విక్రయాలు సాగించడం కష్టంగా మారుతుందంటున్నారు.

Read Also: రిమోట్ కోసం అన్నతో గొడవ పడి చిన్నారి చేసిన పని..

ఇక కోడి గుడ్ల ధర కూడా అమాంతం పెరిగిపోయాయి. డజన్ గుడ్లు ఇంతకు ముందు రూ.48 ఉంటే ప్రస్తుతం రూ.58 నుంచి రూ.60లకు హోల్‌సేల్ వ్యాపారులు విక్రయిస్తున్నారు.