భారత్ ఘన విజయం.. సెంచరీలతో రెచ్చిపోయిన రోహిత్‌, రాయుడు

ముంబై వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. 224 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసి పుణే మ్యాచ్ ఓటమికి రివేంత్ తీర్చుకుంది. వన్డేల్లో భారత్‌కు ఇది మూడో అతిపెద్ద విజయం. పూర్తిగా వన్‌సైడ్‌గా సాగిన పోరులో భారత బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు.

ధావన్ , కోహ్లీ నిరాశపరిచినా… రోహిత్‌శర్మ విండీస్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 137 బంతుల్లోనే 162 పరుగులతో రెచ్చిపోయాడు. అటు తెలుగుతేజం అంబటి రాయుడు కూడా సెంచరీతో కదంతొక్కాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 221 పరుగుల పార్టనర్‌షిప్ సాధించారు. దీంతో భారత్ 377 పరుగులు చేసింది.

ఛేజింగ్‌లో విండీస్ తేలిపోయింది. భారత బౌలర్ల ధాటికి 153 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో నిలిచింది.

Also Read : పంత్‌ కోసం ధోనీని తప్పించే సాహసం కోహ్లీ చేస్తాడా?