కోతి చేతికి చిక్కిన పాము..

కొన్ని దేవాలయాల్లో వానరాలు చేసే అల్లరికి భక్తులు భయ భ్రాంతులకు గురవుతుంటారు. చేతిలోని కొబ్బరి చిప్పలు లాక్కొని వెళుతుంటాయి. మీద పడి కొరికేస్తుంటాయి. ఇలాగే యూపీలోని వృందావన్‌లో గల బాంకే బిహారీ ఆలయ పరిసరాల్లో కోతులు చేస్తున్న అల్లరిని తట్టుకోలేని స్థానికులు జంతు సంరక్షణాధికారులకు కబురు చేశారు. వారు వచ్చి వాటిని బంధించి అడవిలో వదిలేస్తున్నా అవి తిరిగి మళ్లీ జనావాసాల్లోకే వస్తున్నాయి. తాజాగా ఒక వానరం ఆలయ గోపురం మీద నుంచి కిందికి దూకింది. అక్కడ పాములు పట్టే వ్యక్తి చేతిలో నుంచి పాముని తీసుకుని చెంగున పైకెగిరింది. అదే ఆధారంగా బతుకుతున్నాడేమో.. చేతిలో ఉన్న పాముని కోతి ఎగరేసుకుపోయే సరికి కోపం నషాళానికి అంటింది పాములు పట్టే వ్యక్తికి. వెంటనే దాన్ని పట్టుకునే ప్రయత్నం చేసాడు. గుడిపైకి ఎక్కాడు. పట్టుతప్పినా ప్రయత్నించాడు. అయితే అప్పటికే పాముని వానరం చంపేసింది. ఇదంతా ఆలయంలోని సీసీటీవీ కెమేరాలో రికార్డయింది. సోషల్ మీడియాలో పోస్ట్ అవడంతో వైరల్ అవుతోంది.

Also Read: 3 నిమిషాల్లో 15 వార్తలు.. @3pm