అనుష్క పాదాల వెనుక.. ఫోటో వైరల్

అందాల తార అనుష్క భాగమతి తరువాత మరే సినిమా చేయలేదు. గత కొంత కాలంగా సిల్వర్ స్క్రీన్‌కి దూరంగా ఉంటోంది. హీరోల్లో ప్రభాస్, హీరోయిన్స్‌లో అనుష్కల పెళ్లి గురించి అభిమానులకు ప్రధాన టాపిక్ అయింది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటే చూడముచ్చటగా ఉంటుందని ఆశించిన అభిమానులు కూడా ఉన్నారు. అలాంటి వార్తలకు చెక్ పెట్టేస్తూ.. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్సే కానీ లైఫ్ పార్టనర్స్ కావాలనుకోవట్లేదంటూ స్టేట్ మెంట్ కూడా ఇచ్చేశారు. ఆ విషయం లైన్ క్లియర్ అయింది.

మరి అనుష్కకి వరుడుని, ప్రభాస్‌కి వధువుని వెతికే పనిలో పడ్డారు కుటుంబసభ్యులు. ఆ మధ్య అనుష్క గుడికి వెళితే పెళ్లి కావాలని మొక్కుకుందేమో అని గుసగుసలు కూడా వినిపించాయి. తాజాగా మరోసారి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో పెట్టి అభిమానులను సస్పెన్స్‌కి గురిచేసింది అనుష్క. ఈ ఫోటోలో కేవలం అనుష్క పాదం మాత్రమే ఉంది. అయితే దాని వెనుక అర్థాలు మాత్రం చాలా వెతుకుతున్నారు అభిమానులు. దీనిక్రింద ‘నో క్యాప్షన్ రిక్వైర్డ్’ అని కూడా పెట్టింది.

Read Also: షాకింగ్.. దొంగగా మారిన టాలీవుడ్ స్టార్‌ రైటర్‌.. 6 నెలల జైలు శిక్ష..

ఈ పాదానికి త్వరలో పారాణి అద్దబోతుందా అని ఎవరికి వారే ఊహించేసుకుంటున్నారు. వేళ్ల మధ్యలో ఉన్న ఆకుల్ని చూసి త్వరలో ఆ వేలికి మెట్టెలు అలంకరిస్తుందేమో అని సంబరపడిపోతున్నారు. కొందరికి అనుష్క పెళ్లి చేసుకుని ఓ ఇంటిదవ్వాలని ఆశిస్తే, మరి కొందరు మాత్రం మళ్లీ స్క్రీన్‌పై కనిపిస్తే బావుండని కూడా ఆశిస్తున్నారు. చూడాలి.. పాదం వెనుక పలు రకాల ప్రశ్నలకు అనుష్క ఏం సమాధానం చెబుతుందో.