గుడ్‌న్యూస్ చెప్పిన షోయబ్.. సానియా ఇంటికి కొత్త అతిథి

టెన్నిస్ స్టార్ సానియా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఈ సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు షోయబ్ మాలిక్. బేబీమీర్జామాలిక్ అన్న హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేశాడు. ఎప్పట్లాగే సానియా చాలా స్ట్రాంగ్‌గా ఉందంటూ చెప్పుకొచ్చాడు. శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు.

పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2010లో వీరి వివాహం జరిగింది. తర్వాత ఇద్దరూ కెరీర్‌పైనే దృట్టి పెట్టారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో సానియా ప్రెగ్నెంట్ అన్న విషయం బయటకు తెలిసింది. ఇప్పుడు పండంటి బాబుకు జన్మనిచ్చింది. డెలివరీ తర్వాత ఇప్పుడు కొద్ది నెలలు విశ్రాంతి తీసుకున్నాక తిరిగి టెన్నిస్ రాకెట్ పట్టనుంది సానియా. 2020లో టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌లో సత్తా చాటాలని టార్గెట్‌గా పెట్టుకుంది.