సాప్ట్‌వేర్ ఇంజనీర్లకు తీపికబురు.. భారీ నియామకాలు..

వచ్చే ఆరు నెలల్లో ఐటీ సంస్థలు భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నాయి. ప్రధానంగా జూనియర్ లెవల్ ఉద్యోగాలను పెద్ద ఎత్తున రిక్రూట్ చేస్తాయని ఎక్స్పర్టీస్ ఐటీ ఎంప్లాయిమెంట్ అవుట్ లుక్ సర్వే వెల్లడించింది. కొద్ది నెలలుగా తగ్గుముఖం పట్టిన నియామకాలు క్రమంగా ఊపందుకుంటున్నాయని నివేదిక పేర్కొంది. రాబోయే ఏడాదిలో ఐటీ రంగంలో భారీగా నియామకాలు చేపట్టేందుకు పలు సంస్థలు సుముఖంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. సంస్థలోకి ఉద్యోగులను నియమించుకునే క్రమంలో ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాలి అనేదానిపై కంపెనీలు దృష్టి సారించాయి.

Also Read:800 యూనివర్సీటీలు.. ఉచితంగా 10 వేల కోర్సులు..

నాన్ ఐటీ కంపెనీలు సైతం డిజిటల్ రంగం వైపు మళ్లేందుకు అనుగుణంగా సాంకేతిక నిపుణుల నియామకంపై దృష్టి సారించాయని పేర్కొంది. సృజనాత్మకత, వినూత్న ఆలోచనా ధోరణి కలిగిన వారికి ఆకర్షణీయమైన ప్యాకేజీలు లభిస్తాయని నివేదికలో తెలియజేసింది. కాగా, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, బ్లాక్ చైన్, రోబోటిక్స్ వంటి నూతన టెక్నాలజీలపై స్టార్టప్‌లె పనిచేస్తుండడంతో వాటిల్లోకూడా నియామకాలు భారీగా ఉంటాయని వివరించింది.