జియో దీపావళి కానుక..

ఏదో ఒక సందర్భం ఉంటే చాలు ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి కంపెనీలు. ఇప్పటికే జియో దేశాన్ని ఊపేస్తుంది. తాజాగా దీపావళి పేరుతో మరో క్రేజీ ఆఫర్‌ని తీసుకు వచ్చింది. రూ.149 ల పైన ఉన్న ప్యాకేజీలో ఎంత మొత్తం రీచార్జ్ చేసుకుంటే అంత మొత్తాన్ని తిరిగి క్యాష్ బ్యాక్ రూపంలో అందిస్తామంటోంది. నవంబరు 30 వ తేదీ వరకు ఈ
ఆఫర్లో రీ చార్జ్ చేసుకునే యూజర్లు.. ఆ మొత్తాన్ని డిసెంబర్ 31లోగా ఉపయోగించుకునే వీలుంది.

Read Also:సూర్య తండ్రిపై నెటిజన్స్ ఆగ్రహం

అంతే కాకుండా రిలయన్స్ స్టోర్లలో కానీ , జియో స్టోర్లలో కానీ రూ.5 వేలకు మించి వస్తువులు కొనుగోలు చేసినప్పుడు కూడా ఈ కూపన్లను వాడుకోవచ్చు. రూ.1,699 జియో సిమ్‌ను రీచార్జ్ చేసుకుంటే 365 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ డేటాను, ఇస్తుంది. జియో వినియోగదారులకు 5జీ ఫోన్లను అందుబాటులో తీసుకురావాలని కంపెనీ సన్నహాలు చేస్తోంది.