మొన్న జుట్టు.. నిన్న ప్యాంట్.. నేడు షర్ట్..

జుట్టేమో చెరిగిపోయింది.. షర్టేమో నలిగిపోయింది.. ప్యాంట్ కాస్త చిరిగిపోయింది.. వేసుకున్న చెప్పులు అరిగిపోయాయి. ఇది చదువుతుంటే అయ్యో ఎన్ని కష్టాలు వచ్చాయో అని బాధపడుతున్నారా.. ఇవి ఇబ్బందులు కాదు.. ఇష్టాలు. నీట్‌గా తల దువ్వుకుని, ఐరన్ చేసిన డ్రస్ వేసుకుని ఇప్పుడు కనిపించే పరిస్థితి లేదు. ట్రెండ్ మారుతోంది. అలాగే నయా ట్రెండ్‌కు కొత్త దారులను చూపిస్తున్నారు సినీ తారలు. అందులో ఒక అడుగు ముందుకు వేసింది అందాల తార రకుల్.

Also Read : శ్రీరెడ్డి సేప్టీ ఫస్ట్ .. లేకుంటే.. – నెటిజన్లు

చిరిగిన ప్యాంట్ ధరిస్తే ట్రెండ్ అయినప్పుడు.. చిరిగిపోయిన షర్ట్ వేసుకుంటే ట్రెండ్ కాదా.. అనుకుందో ఏమో కానీ.. రకుల్ ఇలా ఖరీదైన డెనిమ్ మోడ్రన్ షర్ట్‌లో దర్శనం ఇచ్చింది. తన అందాలు ప్రదర్శిస్తూ ధరించిన షర్ట్‌తో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫోటో కాస్త వైరల్‌గా మారింది. మరి ఈ ముద్దుగుమ్మను ఎంతమంది ఫాలో అవుతారో చూడాలి.

 

View this post on Instagram

 

Sheepish me when I’m caught being the goofy me 😂 #keepthechildinyoualive alwaysssss 🤪

A post shared by Rakul Singh (@rakulpreet) on