అమర్ అక్బర్ ఆంటోని టీజర్ చూస్తుంటే..

మాస్ మహారాజ్ రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ అమర్ అక్బర్ ఆంటోని. చాలా కాలం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో సినిమాపై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ఉంది. అందులోనూ ఫ్లాపుల్లో ఉన్న రవితేజకి, శ్రీనువైట్లకి ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవ్వడం ఎంతో అవసరం.

Also Read : అనుష్క పాదాల వెనుక.. ఫోటో వైరల్

అమర్ అక్బర్ ఆంటోని ఫస్ట్ లుక్ ని ఆ మధ్య రిలీజ్ చేశారు. రీసెంట్ గా ఫస్ట్ లుక్ టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. రవితేజ న్యూ లుక్ లో, మూడు పాత్రలుగా కనిపిస్తున్నారు. అంటే రవితేజ ట్రిపుల్ రోల్ పోషిస్తున్నాడో, లేక ఒక్కరినే ముగ్గురుగా శ్రీనువైట్ల చూపిస్తున్నాడో ఇప్పుడే చెప్పడం కష్టం. ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ కి మాత్రం మంచి రెస్పాన్స్ వస్తోంది.

అమర్ అక్బర్ ఆంటోని మూవీ ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కినట్లు టీజర్ చూస్తే అర్ధమవుతోంది. అలాగే ఇందులో హీరోయిన్ గా గోవా బ్యూటీ ఇలియానా నటిస్తోంది. చాలా కాలం తర్వాత ఇలియానా మళ్ళీ ఈ సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తోంది. వరుసగా భారీ హిట్స్ అందుకుంటున్న మైత్రీ మూవీస్ సంస్థ ఈ ఛిత్రాన్ని నిర్మిస్తుండటం సినమాకి ప్లస్ గా మారింది. అమర్ అక్బర్ ఆంటోని, నవంబర్ 16న విడుదలకు రెడీ అవుతోంది.