సవ్యసాచి మూవీపై ఇంట్రెస్ట్ పెరగడానికి కారణం వారే..!

మైత్రీ మూవీస్ బ్యానర్లో చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య నటించిన చిత్రం సవ్యసాచి. టైటిల్ తోనే సినిమాపై ఇంట్రెస్ట్ పెంచింది టీమ్. నాగచైతన్యకి జోడీగా నిధి అగర్వాల్ నటించింది. కీరవాణి సంగీతం అందించారు. ఆల్ రెడీ రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై బజ్ పెరిగింది.

Also Read : అమర్ అక్బర్ ఆంటోని టీజర్ చూస్తుంటే..

సవ్యసాచి మూవీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోంది. చైతూ క్యారెక్టర్ ని చాలా స్పెషల్ గా డిజైన్ చేశాడు చందు. తన క్యారెక్టర్లో రెండు వేరియేషన్స్ చూపించబోతున్నాడు చైతూ. అలాగే విలన్ గా తమిళ హీరో మాధవన్ నటిస్తే, చైతూకి అక్కగా భూమిక నటించింది. వీరి వల్ల సవ్యసాచిపై మరింత ఇంట్రెస్ట్ పెరిగింది.

సవ్యసాచి మూవీ నవంబర్ 2న విడుదలవుతోంది. నిన్ననే సెన్సార్ కంప్లీట్ చేసుకుని యుబైఎ సర్టిఫికేట్ అందుకుంది. అన్ని రకాలుగా సవ్యసాచిపై పాజిటివ్ బజ్ కనిపిస్తోంది. తనకి ఈ సినిమాతో మాస్ ఫాలోయింగ్ వస్తుందని నమ్ముతున్నాడు నాగచైతన్య. ఈ దీపావళికి తెలుగులో వస్తున్న పెద్ద సినిమా సవ్యసాచినే. సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా, చైతూ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా సవ్యసాచి నిలవడం ఖాయం.