స్మోకింగ్, డ్రింకింగ్ చేస్తే మంచి అమ్మను కాదా.. నటి ఫైర్

కొన్నింటిని సమాజం ఆమోదించదు. కాదు కూడదని నలుగురు నడిచే దారిలో నేను నడవను. నా రూటే సెపరేటు అంటే విమర్శలకు గురికాక తప్పదు. అమ్మానాన్నలు పిల్లలకి రోల్ మోడల్‌గా ఉండాలి. అమ్మ అమ్మగా ఉంటేనే మంచి చెడూ వివరించగలదు. పిల్లలు తప్పు దారిలో నడిస్తే వారించగలదు. అనే ఒక అభిప్రాయం సమాజంలో బలంగా నాటుకుపోయింది. ఎవరు అంగీకరించినా, అంగీకరించక పోయినా నిజం కూడా అదే..

బాలీవుడ్ నటి శ్వేతా సాల్వే కొద్ది రోజుల క్రితం సిగరెట్ తాగుతున్న ఫొటోని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అది కాస్తా వైరల్ అయ్యి నెటిజన్స్ చేతిలో బుక్కయింది. ఇలా చేయడానికి సిగ్గు లేదా? మీరు మంచి తల్లి కాదు. మీ పిల్లలకు కూడా మీ అలవాట్లే వస్తాయంటూ ట్రోల్ చేస్తున్నారు. దీంతో శ్వేత వారికి సమాధానమిస్తూ.. అవును.. నేను సిగరెట్ తాగుతాను, డ్రింక్ చేస్తాను.. అంత మాత్రాన నేను బ్యాడ్ మదర్ అంటే నేను ఒప్పుకోను.. నేను నిజాయితీగా ఉంటాను. నిత్యం ఎన్నో పనులతో బిజీగా ఉంటాను. నటిని, డ్యాన్సర్‌ని, పారిశ్రామిక వేత్తని.

అనుష్క పాదాల వెనుక.. ఫోటో వైరల్

ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడను. నా పని నేను చేసుకుంటాను. నా పిల్లల్ని పట్టించుకుంటాను. కాబట్టి నా పర్సనల్ లైఫ్‌కి సంబంధించి మీరు ఎలాంటి ప్రశ్నలు వేయకండి అంటూ నెటిజన్స్‌పై శ్వేత మండిపడుతున్నారు. మా అమ్మానాన్న నన్ను పద్ధతిగానే పెంచారు. మంచి, చెడు గురించి తెలియజేశారు. మీరే నన్ను ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నారు. ఒక వేళ నేను నచ్చకపోతే నన్ను ఫాలో అవకండి అంటూ ఘాటుగా సమాధానం చెప్పింది. నేను నాకు నచ్చినట్లు ఉంటా. అడగడానికి మీరెవరు అంటూ మళ్లీ డ్రింక్ చేస్తున్న ఫోటోని షేర్ చేసింది.