కుప్పకూలిన హెలికాఫ్టర్.. 25 మంది మృతి

afghanistan-army-helicopter-crash-senior-officials-among-25-dead

ఇండోనేషియాలో జరిగిన విమాన ప్రమాదం మరువకముందే.. ఆఫ్ఘనిస్తాన్‌లో సైనిక హెలికాఫ్టర్ కుప్పకూలింది. దాంతో 25 మంది మృతిచెందారు. ఇవాళ(బుధవారం) ఉదయం 9:10కు ఫరా ప్రావిన్స్‌లో హెలికాప్టర్ కూలిపోయినట్టు ఆ దేశ మీడియా వెల్లడించింది.

Also Read : ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు శుభవార్త.. అమరావతిలో ఇళ్ల కోసం..

కాగా మృతుల్లో ఫరా ప్రావిన్స్ కౌన్సిల్ సభ్యులు సహా జాఫర్ మిలటరీ కార్ప్స్ చెందిన సీనియర్ అధికారులు ఉన్నారనీ ఆ దేశ మీడియా పేర్కొంది. వాతావరణం అనుకూలించని కారణంగా ఈ ప్రమాదం జరిగిందని. జాఫర్ మిలటరీ కార్ప్స్ ప్రతినిధి నజీబుల్లా నజీబీ వెల్లడించారు. కొండప్రాంతమైన అనార్ దారా జిల్లా నుంచి హెరాత్ ప్రావిన్స్‌కు బయల్దేరిన కొద్ది సేపటికే హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది.