చైతూ స్టెప్పులతో ‘లగాయితూ’ పాట ఎక్కడికో..

తెలుగు సినిమాల్లో పాత పాటలను రీమిక్స్ చేయడం అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది. కానీ కొన్ని పాటలు మాత్రం భలే ఆకట్టుకుంటాయి. కారణం.. అవి వాటి ఒరిజినల్ టైమ్స్ లో సృష్టించిన సంచలనాలే. అలా ఒక దశాబ్ధం పాటు తెలుగు ప్రేక్షకులను ఊపేసిన పాట నిన్ను రోడ్డు మీద చూసినదీ లగాయితూ అనే పాట.. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1993లో విడుదలైన ఈ సినిమా అల్లరి అల్లుడు. ఇందులోని అన్ని పాటలూ బ్లాక్ బస్టర్. ఆ టైమ్ లో మంచి రైజింగ్ లో ఉన్న కీరవాణి క్రియేట్ చేసిన మ్యూజికల్ మ్యాజిక్ ఈ ఆల్బమ్. నాగార్జున సరసన నగ్మా, మీనా హీరోయిన్లుగా నటించారు. ముఖ్యంగా నిన్ను రోడ్డుమీద చూసినదీ లగాయితూ అనే పాటలో స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చిన రమ్యకృష్ణ మరో హైలెట్ గా నిలిచింది. అలాంటి సూపర్ హిట్ సాంగ్ ను ఇప్పుడు నాగ్ తనయుడు నాగచైతన్య సవ్యసాచి కోసం రీమిక్స్ చేస్తున్నాడు. ఇక ఈ సారి కూడా కీరవాణినే ఈ పాటకు సంగీతం సమకూర్చారు. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ప్రోమోలో చైతన్య అదిరిపోయే స్టెప్పులు వేసి పాటను ఇరగదీశాడు. అటు హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా అందంగా ఉండటమే కాదు.. అదిరిపోయే స్టెప్పులతో అలరించింది. మొత్తంగా ఆ పాట ఓ డెకేడ్ పాటు ఊపేసింది. మరి ఈ పాట ఎన్నాళ్లూ ప్రేక్షకులను రంజింప
చేస్తుందో చూడాలి.