ఆమెకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు దక్కవు..

acter-sivaji-fire-on-ycp-leader-lakxmiparvathi

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఆపరేషన్‌ గరుడ సెగలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంపై జరుగుతున్న కుట్రలను బయటపెడుతూ వస్తున్న సినీ హీరో శివాజీ… తనపై వస్తున్న విమర్శలకు సైతం ఘాటుగా జవాబిస్తున్నారు.

Also read : పటేల్‌ విగ్రహం ఏర్పాటుపై రాజకీయ రగడ

తన చివరి శ్వాస దాకా.. ఆంధ్రప్రదేశ్‌ హక్కుల కోసం తాను పోరాడుతూనే ఉంటానని శివాజీ స్పష్టం చేశారు. ఢిల్లీ రాక్షసుల భరతం పడతానంటూ హెచ్చరించారు. టీడీపీ అండతో శివాజీ అమెరికా పారిపోయాడన్న వైసీపీ నేతల వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. వ్యక్తిగత పనుల కోసమే విదేశాలకు వెళ్లినట్లు స్పష్టం చేశారు.

ఇక… శివాజీ ప్రాణాలకు ముప్పుందంటూ వైసీపీ నేత లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్‌ ఇచ్చారు. తాను చావుకు భయపడేంత పిరికివాడిని కాదని స్పష్టం చేశారు. లక్ష్మీపార్వతి తనపై జాలి చూపాల్సిన అవసరంలేదని.. ఆమెను చూస్తేనే జాలేస్తోందన్నారు. వైసీపీ తరపున ఎన్ని వాదనలు చేసినా… లక్ష్మీపార్వతికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు దక్కవని శివాజీ వ్యాఖ్యానించారు.

నవంబర్‌ పదో తేదీన భారత్‌కు తిరిగి వస్తున్నానని… ఎవరు ఎలాంటి స్వాగతం చేసుకుంటారో చేసుకోవాలంటూ శివాజీ సవాల్‌ విసిరారు. వైసీపీ, బీజేపీల బెదిరింపులకు భయపడేది లేదన్న ఆయన.. దర్యాప్తు సంస్థలు పిలిస్తే తక్షణమే రాష్ట్రానికి తిరిగొస్తానని చెప్పారు.