నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర పోలీసు శాఖలోని ఖాళీగా ఉన్న ఎస్సై పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 3,137 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం ఈ మేరకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

పోస్టులు

* ఎస్సై
* అసిస్టెంట్ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌
* కానిస్టేబుళ్లు
* డిప్యూటీ జైలర్
* వార్డర్‌ పోస్టులు

ఆన్‌లైన్ దరఖాస్తు

* నవంబర్ 5 నుంచి 24 వరకు
ఆన్‌లైన్‌లో slprb.ap.gov.in వెబ్‌సైట్‌లో అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.
* ఎస్సై పోస్టులకు రాత పరీక్షను డిసెంబర్ 16న నిర్వహించనున్నారు.
* పోలీస్‌ కానిస్టేబుల్, వార్డర్ల అప్లికేషన్లు ఆన్‌లైన్‌ ద్వారా నవంబర్ 12 నుంచి డిసెంబర్‌ 7 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు.