ఏదో ఒకటి ఇస్తే ఎలా తీసుకుంటారు.. కాకి గోల.. వీడియో

నాకు నచ్చింది ఇవ్వకపోతే నేనెలా తీసుకుంటాను.. అంత చీప్‌గా కనిపిస్తున్నానా.. మీకు ఇష్టం వచ్చింది నా మొహాన పడేస్తే.. నాకూ నచ్చాలి కదా.. మీకు ఇష్టం లేకపోతే మీరు తీసుకుంటారా.. మాట్లాడితే కాకి గోల అంటారు.. ఏం.. మీరు మాత్రం గొడవ చేయరా.. మార్కెట్‌కి వెళ్లగానే.. బాబూ బతికున్న చేపని, ముళ్లు తక్కువగా ఉన్న చేపని ఇవ్వమని అడగరా ఏంటి? నాకు మాత్రం ఏదో ఒకటి తీసుకోమని ఇస్తారా.. అని షాపు యజమానితో గొడవకు దిగినంత పని చేసింది కాకి.

తన ఇంటిలిజెంట్ బ్రెయిన్‌ని ఉపయోగించి తనకు నచ్చిన చేప ఇచ్చేదాకా వదల్లేదు. ఏదో ఒకటి తీసుకుని ఎగిరిపోవచ్చు. కానీ.. నేను వెళ్లిన తరువాత షాపుకి వచ్చిన వాళ్లందరికీ.. పాడు కాకి ఒకటి వచ్చింది. నా చేపల్ని పట్టుకుపోయింది అని అందరికీ చెప్పి నా పరువు తీస్తావు.

Read Also: మీ టూ ఎఫెక్ట్.. దగ్గుబాటి రానాకి..

నా విలువని ఏ మాత్రం గుర్తించవు. నేను లేకపోతే చెత్తా చెదారం పడేసే మీ పరిసరాలని ఎవరు శుభ్రం చేస్తారు. మీరు తినగా మిగిలిందే కదా మేం తినేది. ఇది తెలుసుకుని ఇప్పటికైనా మా పట్ల కృతజ్ఞతా భావంతో ఉంటే సంతోషం అని.. తనకు నచ్చిన చేపని షాపువాడు ఇచ్చేసరికి అది తీసుకుని సంతోషంతో ఎంచక్కా ఎగిరిపోయింది.