అమ్మాయిగా సర్జరీ చేయించుకున్నా: ‘జబర్దస్త్’ పార్టిసిపెంట్

అవసరం కొద్దీ అనో, అవకాశం వచ్చిందనో కొంత మంది అబ్బాయిలు అమ్మాయిల వేషం వేస్తుంటారు. చెబితే కానీ తెలియనంతగా ఆ పాత్రల్లో ఒదిగిపోతారు. మరికొంత మంది అబ్బాయిగా జన్మించినా హర్మోన్స్ ప్రభావం వలన అమ్మాయిల్లా ఉండాలనిపిస్తుంది. ఎవరు అవునన్నా కాదన్నా మారిపోతామంటారు.

ఇలాగే ఓ ప్రముఖ ఛానెల్‌లో వస్తున్నజబర్దస్త్ షోలో నటించిన సాయితేజ ఇప్పుడు సాయి తేజస్వినిగా మారిపోయాడు (మారిపోయింది). ఆ షోలో కూడా అమ్మాయిగా వేషం వేసి ప్రేక్షకులను అలరించాడు. అభిమానులను సంపాదించుకున్నాడు. అంతకు ముందు సాయి తేజ ఎవరో తెలియదు. కానీ షో ద్వారా పాపులర్ అయిపోయాడు. అయితే ఈ మధ్య కొన్ని నెలలుగా సాయితేజ షోలో కనిపించడం లేదు. మళ్లీ ఇప్పుడు సడెన్‌గా ప్రత్యక్షమయ్యాడు.

యూట్యూబ్ చానెల్ ద్వారా తన మనసులోని ఆవేదనను అందరితో పంచుకున్నాడు. ఆరు నెలల కిందట తాను సర్జరీతో లింగ మార్పిడి చేయించుకున్నానని చెప్పాడు. ఇది షో కోసం తీసుకున్న నిర్ణయం కాదని.. అబ్బాయిగా ఉండి కూడా అమ్మాయి వేషం వేసి డబ్బులు సంపాదించవచ్చు. అయితే తనకు చిన్నప్పటినుంచే అమ్మాయిలా ఉండాలని ఉండేదని, అందుకే రోజూ అక్క బట్టలు వేసుకుని అద్దం ముందు నిల్చుని చూసుకుంటూ ఉండేవాడినని చెప్పాడు. ఇంట్లో వారికి చెబితే బాధపడతారని వారిక్కూడా చెప్పకుండా ఏడుస్తూ ఉండేవాడినని అన్నాడు.

Read Also:చైతూ స్టెప్పులతో ‘లగాయితూ’ పాట ఎక్కడికో..

ఇప్పుడు సర్జరీ చేయించుకున్న విషయం కూడా వారికి తెలియదన్నాడు. ఏదో ఒక రోజు తెలియాల్సిందే.. అందుకే ఆ విషయాన్ని స్వయంగా నేనే బయటపెడుతున్నా. అబ్బాయిగా ఉండి అమ్మానాన్నబలవంత మీద ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా.. భార్యను సంతోష పెట్టలేక ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నాడు. అమ్మాయిగా మారి ఆరు నెలలైనా ధైర్యంగా బయటకు వెళ్లలేకపోతున్నానని బాధ పడుతున్నాడు. ఆరోగ్య పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కున్నానన్నాడు.

లింగ మార్పిడి చేయించుకున్న తరువాత ఆర్ధరైటిస్ వచ్చిందని.. పెద్ద హాస్పిటల్స్‌కు వెళ్లి చూపించుకున్నానని.. ఆ సమయంలో స్నేహితులు అండగా నిలిచి తనను రక్షించారని చెప్పాడు. బెడ్ మీద నుంచి కాలు కింద పెట్టలేని పరిస్థితిలో స్నేహితులే తనకు సాయం చేశారన్నాడు. అందుకే ఇన్ని రోజులు జబర్ధస్త్ షోలో కనిపించలేదు. పూర్తిగా కోలుకున్నాక అమ్మాయిగా మళ్లీ మిమ్మల్ని అలరిస్తానంటున్నాడు.