నిరాశపరిచిన ధావన్.. పోటీ ఇవ్వలేకపోయిన..

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను టీమిండియా 3-1తో కైవసం చేసుకుంది. వన్‌సైడ్‌గా ముగిసిన చివరి మ్యాచ్‌లో విండీస్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి కేవలం 104 పరుగులకే కుప్పకూలింది.

పావెల్ , హోప్ డకౌటవగా… హెట్‌మెయిర్ 9 పరుగులకే ఔటయ్యాడు. కెప్టెన్ హోల్డర్ చేసిన 25 పరుగులే విండీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్‌. భారత బౌలర్లలో జడేజా 4 , బూమ్రా 2, ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టారు.

Also Read : ప్రెగ్నెంట్ మహిళకు ఆపరేషన్ చేస్తూ.. డాక్టర్ చేసిన పని..

105 పరుగుల టార్గెట్‌ను టీమిండియా 14.5 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి చేదించింది. ధావన్ నిరాశపరిచినా.. ఫామ్‌లో ఉన్న రోహిత్‌శర్మ 63 , కోహ్లీ 33 పరుగులతో జట్టు విజయాన్ని పూర్తి చేశారు.