టిప్ టాప్ గా రెడీ అయ్యి చేసే పని చూస్తే..

women-stolen-gold-items-in-jewelary-shops

ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని, టిప్ టాప్ గా రెడీ అయ్యి జువెలరీ షాపుల్లోకి వెళ్లిందో మహిళ.. ఆమె నగలు కొనడానికి వెళ్ళింది అనుకుంటే పొరపాటే.. షాపు సిబ్బంది దృష్టి మరల్చి నకిలీ గొలుసులు పెట్టి బంగారు నగలు కొట్టేయాలని ప్లాన్ చేసింది. దాంతో అడ్డంగా దొరికిపోయింది. మూసాపేట జనతానగర్‌లో నివాసముండే బాద రేఖ(29) ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్‌ తదితర ప్రాంతాల్లో సెక్యూరిటీ గార్డుగా, బ్యూటీషియన్‌ షాపుల్లో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తుండేది. విలాసాలకు అలవాటు పడిన ఆమె వచ్చే జీతం సరిపోకపోవడంతో దొంగతనాలు చేస్తోంది.

Also read : అమ్మాయిగా సర్జరీ చేయించుకున్నా: ‘జబర్దస్త్’ పార్టిసిపెంట్

మొదట్లో చిన్నచిన్న దొంగతనాలు చేస్తున్న ఆమె నగలు దొంగతనం చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న దురుద్దేశ్యంతో స్కార్ఫ్ కట్టుకుని జువెలరీ షాపుల్లోకి వెళ్లేది. సిబ్బంది ద్రుష్టి మరల్చి నగలు దొంగతనం చేసేది. అలాగే ఈనెల 22వ తేదీ సాయంత్రం చైతన్యపురిలో ఖజానా జువెలరీ దుకాణానికి వెళ్లింది. సేల్స్‌మన్‌ దృష్టి మళ్లించి నకిలీ బంగారు గొలుసులు ట్రేలో పెట్టి బంగారు గొలుసులు తీసుకొని అక్కడినుంచి జారుకుంది. విషయం గ్రహించిన షాపు నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితురాలిని అరెస్టు చేశారు. ఇదివరకే సదరు మహిళపై నాలుగు కేసులు ఉన్నట్టు విచారణలో వెల్లడైంది.