బడా వ్యాపారిని కవ్విస్తూ కాల్ చేసి..

అమ్మాయిల గొంతు స్మూత్‌గా సున్నితంగా ఉంటుంది. ఎవర్నైనా లైన్లో పెట్టాలంటే ఆ గొంతులో మరికొంత అమృతాన్ని నింపి మరిన్ని ఒయ్యారాలు ఒలకబోస్తారు. ఎదుటి వ్యక్తిని బుట్టలో పడేస్తారు. దీంతో ఎంతటి మగ మహారాజైనా ప్లాట్ అయిపోవలసిందే. అబ్బాయిలే కాదు అమ్మాయిల్లో కూడా మోసగాళ్లు, మాయగాళ్లూ ఉంటారు.. వారి బారినుంచి తెలివిగా తప్పించుకోపోతే అడ్డంగా బుక్కైపోవాల్సి వస్తుంది. అహ్మదాబాద్‌కు చెందిన ఓ అమ్మడు అచ్చంగా ఇలాగే చేసింది.

Read Also:అమ్మాయిగా సర్జరీ చేయించుకున్నా: ‘జబర్దస్త్’ పార్టిసిపెంట్

గుజరాత్‌కు చెందిన విజయ్ నారంగ్ బడా వ్యాపార వేత్త. వ్యాపార వ్యవహారాలకు సంబంధించి ఫోన్ ద్వారా ఓ అమ్మాయి పరిచయం అయింది. ముందు కొద్దిరోజులు వ్యాపార విషయాలు మాట్లాడినా.. ఆ తరువాత మీకు పెళ్లైందా.. అయితే పిల్లలెంత మంది.. మీ ఆవిడ మీతో  ఎలా ఉంటారు..  ఇలా మాట్లాడుతూ అతడిని ట్రాప్ చేయాలని చూసింది. రోజూ వాట్సాప్ యాప్‌లో కాల్ చేస్తూ, స్నేహం చేయమంటూ వేధింపులు ప్రారంభించింది. వ్యాపారస్తునికి విషయం అర్థమైంది. ఆమె అంతరంగాన్ని తెలుసుకున్న వ్యాపారస్తుడు మోసం చేస్తుందన్న విషయాన్ని గ్రహించాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువతి ఎవరన్న విషయం ఆరా తీసి విచారణ ప్రారంభించారు.