దీపావళి మరింత సంతోషంగా.. ‘మారుతీ’ కార్లపై భారీ డిస్కౌంట్

పండగ వచ్చిందంటే చాలు ఆఫర్లతో హోరెత్తిస్తుంటాయి ఆయా కంపెనీలు. కస్టమర్లను పెంచుకునే దిశగా కొన్ని వస్తువులపై భారీ డిస్కౌంట్స్ ఇస్తుంది. మరికొన్ని సంస్థలు పోటీని తట్టుకునేందుకు పక్క వారికంటే ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వాలని చూస్తుంటాయి. తాజాగా మారుతీ సుజుకీ అలాంటి ఆలోచనే చేసింది. 23 శాతం డిస్కౌంట్‌తో మారుతీ కారుని మీ సొంతం చేసుకోవచ్చంటోంది.

స్విప్ట్, డిజైర్, బాలెనోలపై రూ.18,750 వరకు డిస్కౌంట్ ఇస్తోంది. గతంలో ఇచ్చిన డిస్కౌంట్ కన్నా ఇది రూ.3,500 ఎక్కువ. రానున్న ధంతేరాస్, దీపావళి పండుగలను పురస్కరించుకుని కస్టమర్లను అట్రాక్ట్ చేస్తోంది. మరిన్ని కొనుగోళ్లు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు మారుతీ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఆర్ ఎస్ కల్సీ అంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో పాటు, ఇన్సూరెన్స్ రేట్లు పెరగడం, వడ్డీ రేట్లు పెరగడం కూడా అక్టోబర్ విక్రయాలపై ప్రభావం చూపింది.

ష్.. ఫ్లైట్‌లో 5 నిమిషాల కంటే ఎక్కువ ఏడ్చావంటే..

కార్ల అమ్మకాలు అంత ఆసక్తిగా లేవని అంటున్నారు. అయితే మారుతి సుజుకీ మీద ఆ ప్రభావం అంతగా కనిపించలేదని కల్సీ తెలిపారు. గత సెప్టెంబరు నెలలో తొలిసారి 1.5 శాతం క్షీణతతో 1,38,100 యూనిట్స్ అమ్మితే.. అక్టోబర్‌లో 1,46,766 యూనిట్స్‌ని విక్రయించింది. అటు రెండవ అతిపెద్ద కార్ల తయారీదారు హ్యూందాయ్ కూడా కార్ల ధరలపై డిస్కౌంట్‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.