రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది. దీనికి సంబంధించినఓ వీడియోను డివివి ఎంటర్‌టైన్‌మెంట్ విడుదల చేసింది. ఈ నెల 11న  11 గంటలకు ఈ మల్టీస్టారర్ మూవీని ప్రారంభించబోతున్నట్లు తెలిపింది.11 11 11-R R R అనే సందేశంతో 34 సెకండ్ల వీడియోను విడుదల చేసింది డివివి ఎంటర్‌టైన్‌మెంట్. ఈ సినిమానుతెలుగు తమిళ హిందీ భాషల ప్రేక్షకులకు సులువుగా కనెక్ట్ అయ్యేలా ఉంటుందని సమాచారం. ‘ఆర్ ఆర్ ఆర్’ కథకు సంబంధించిన స్టోరీ లైన్ ను వివరించడంతో పాటు ఈమూవీ టైటిల్ ను కూడ ఈ సినిమా ప్రారంభం రోజునే ప్రకటిస్తారని టాక్. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించనున్నారు