రివ్యూ: ప్రతీకారం అనే ఎమోషన్‌పై నిర్మించిన థ్రిల్లింగ్ డ్రామా ‘సవ్యసాచి

 

‘సవ్యసాచి’ సినిమా రివ్యూ

నటీనటులు : నాగచైతన్య, నిధి అగర్వాల్, మాధవన్, భూమిక, వెన్నల కిషోర్ తదితరులు.

దర్శకత్వం : చందు మొండేటి

నిర్మాతలు : నవీన్ వై. సి వి మోహన్, వై రవి శంకర్

సంగీతం : ఎమ్ ఎమ్ కీరవాణి

సినిమాటోగ్రఫర్ : జే యువరాజ్

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు

చందు మొండేటికి ఈ ట్రెండ్ డైరెక్టర్ గా పేరు ఉంది. నాగచైతన్య కాంబినేషన్ లో వచ్చిన ప్రేమమ్ హిట్ అయి వీరి కాంబినేషన్ మీద అంచనాలను పెంచింది. వరుస హిట్స్ ఇస్తున్న మైత్రి మూవీ మేకర్స్ నుండి వస్తున్న ఈ సినిమాకు మాధవన్ అడిషనల్ ఎట్రాక్షన్ గా మారాడు. మరి ఇన్ని అంచనాల తో వచ్చిన సవ్యసాచి ఎలా ఉందో చూద్దాం.
కథ:

విక్రమ్ ఆదిత్య(నాగచైతన్య) వానిషింగ్ ట్విన్స్ సిడ్రోమ్ కారణంగా విక్రమ్ లో మరో మనిషి స్పందనలు ఉంటాయి. అవి తన తోడ బుట్టిన వాడివి అయినా అవి తన ఆలోచనలకు భిన్నంగా ఉంటాయి. తన ఎడమ చేయి తనలోని మరో మనిషి ఆదీనంలోకి వెళ్లి పోతుంటుంది. విక్రమ్ కి ఇది ఇబ్బందిగా మారుతుంది. యాడ్ ఫిల్మ్ మేకర్ అయిన విక్రమ్ యుస్ కి యాడ్ మేకింగ్ కోసం వెళ్లి తిరిగి వచ్చే సరికి తన అక్క కుటుంబం ఒక ప్రమాదానికి గురౌతుంది. ఆ ప్రమాదంలో బావ, మేనకోడలు చనిపోతారు. తన జీవితం ఒక్కసారిగా తల్లక్రిందులు అవడానికి కారణం ఎంటని ఆలోచిస్తుంటే అతనకి అరుణ్( మాధవన్) నుండి ఫోన్ వస్తుంది. అక్కడి నుండి అడుగడుగునా విక్రమ్ ప్రమాదాల తో పోరాటం చేస్తుంటాడు. చావు బతుకుల మద్య మిగిలిన అక్క(భూమిక) కోమాలో ఉంటుంది. చనిపోయిందనుకున్న మేనకోడలు బ్రతికేఉందనే నిజం తెలుస్తుంది. అరుణ్ ఎందుకు తన మేనకోడలు ను కిడ్నాప్ చేసాడు. తనలోని ఆదిత్య తనకు బలంగా మారాడా..? బలహీనతగా మారాడా..? విక్రమ్ ఈ సమస్య నుండి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది మిగిలిన కథ..?

కథనం:
సవ్యసాచి టీజర్, ట్రైలర్ ని చూసిన ప్రేక్షకులకు ఈ సినిమా పై ఆసక్తి కలగడానికి కారణం ఇందులో కనిపించిన కొత్త కాన్సెప్ట్ . ఒక మనిషి లో ఉండే మరో మనిషి స్పందనలకు అనుగుణంగా అతని ఎడమ చేయి కదలడం. ఈ కాన్సెప్ట్ సినిమాకి బేస్ అయితే ఆ బేస్ పాయింట్ ని ఎక్స్ ప్లోర్ చేయడంలో దర్శకుడు ప్రతిభ ఏ మాత్రం కనిపించలేదు. ఎందుకుంటే సినిమా మొదట్లో అతని లోని సమస్య దాని పర్యవసానాలు డాక్టర్ తో చెప్పించిన దర్శకుడు తర్వాత ఆ కాన్సెప్ట్ పై పెద్ద వర్క్ చేయలేదని పిస్తుంది. ఎందుకుంటే ఆకాన్పెప్ట్ ని దృష్టిలో పెట్టుకొని సినిమాకి వచ్చే ప్రేక్షకులకు కొత్త సినిమా కనపడతుంది. అది ప్రేమ కథ. ఆ ప్రేమ కథ లో కాస్త ఫన్ వర్క్ అవుట్ అయ్యిందే కానీ ఫీల్ వర్క్ అవుట్ అవలేదు. నిధి అగర్వాల్ చూడటానికి అందంగా ఉందనే విషయం తప్ప ఆమె క్యారెక్టర్ లో ఒక బలమైన సన్నివేశం కూడా లేదు. ఆ ప్రేమ కథ ఎందుకు బ్రేక్ అప్ అవుతందనే విషయం లో కూడా దర్శకుడు చూపెట్టిన రీజన్ కి బలం లేదు. అందుకే ఆ ప్రేమ కథ టైంపాస్ గా అనిపించింది. సరే కాన్సెప్ట్ పై ఊహాలు పెట్టుకొని థియేటర్స్ కి వచ్చిన ప్రేక్షకులకు ఈ ప్రేమ కథ ఇబ్బందిగా నే మారింది. సవ్వసాచి లా రెండు చేతులతో హీరో చేసే అద్బుతాలు చూద్దాం అనుకునే ప్రేక్షకులు బ్రేక్ అప్ అయి ప్యాచ్ అప్ అయ్యే వీరి లవ్ స్టోరీ సైడ్ ట్రాక్ లా అనిపిస్తుంది. ఈ లవ్ స్టోరీ లో షకలక శంకర్ , వెన్నెల కిషోర్ , సత్య ల కామెడీ వర్క్ అవుట్ అయ్యింది. కాన్సెప్ట్ వైపు వెళ్ళి ఒకరిలో ఇద్దరు ఉండటం తో వచ్చే అడ్వాంటేజ్ లు, డిజట్వాంజ్ లను లోతుగా చూపించే సన్నివేశాలను డిజైన్ చేయడంలో దర్శకుడు పెద్దగా ఆసక్తిని కనబరచలేదు అనిపించింది. ఎందుకంటే మొదటి భాగం అంతా లవ్ స్టోరీ తో టైం పాస్ చేస్తే ద్వితియార్దం లో జబర్దస్త్ స్కిట్ ను తలిపించే సుబధ్రా పరిణయం , లగాయిత్ పాటలతో మరింత సమయం వృధా చేసాడు. సినిమా చూద్దాం అనుకుని వచ్చిన వారికి రాహుల్ ద్రవిడ్ యాడ్ ఎంత ఇరిటేట్ చేస్తుందో కాన్పెప్ట్ లోకి వెళ్లకుండా దర్శకుడు చేసిన టైంపాస్ సీన్స్ కూడా అలాగే అనిపిస్తాయి. ఇక మాధవన్ ఎంటరయ్యాడు సినిమా పరుగులు పెడుతుంది అనుకుంటే అతని పాత్ర డిజైన్ లోనే చాలా ప్రశ్నలు వదిలేసాడు దర్శకుడు. అతను మేథావి అయినా తనను గొప్పదనం గుర్తించని వారిని చంపేయాలనుకునే ఉన్మాదిగా మారిన తీరును కేవలం మాటలలో చెప్పించాడు. మాధవన్ బాధను సీన్స్ గా మలిచి ఉంటే ఆ పాత్రకొంత వరకూ కనెక్ట్ అయ్యేది అనిపిస్తుంది. ఇక తను చేసుకోవాలనుకున్న అమ్మాయి కూతుర్ని పెంచుకోవాలనుకోవడం లాంటి సడన్ ఛేంజ్ లు విలన్ క్యారెక్టర్ లోకి రావడం అతని పాత్రను సరిగా ప్రజెంట్ చేయకపోవడంతో సవ్వసాచి కి బలం అనుకున్న మాధవన్ కూడా పోస్టర్ వాల్యూని పెంచాడే తప్ప సినిమాకి ఏమీ చేయలేకపోయాడు. ఇక కీరవాణి పాటలలో ఏదీ పెద్దగా సినిమా హాలు నుండి బయటకు వచ్చాక గుర్తుకు రాదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సెంకండాఫ్ లో బాగుంది. చైతన్య తన పాత్రకు న్యాయం చేసాడు. నిధి అగర్వాల్ గ్లామరస్ గా కనిపించింది. కాలేజ్, యుస్ ఎపిసోడ్స్ లో కామెడీ ట్రాక్ వర్క్ అవుట్ అయ్యింది. సరదాగా అనిపించే సన్నివేశాలు ఉన్నా కాన్సెప్ట్ పై పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయాడు సవ్వసాచి.

చివరిగా:
కాన్సెప్ట్ ను విడిచి కామెడీ చేసిన సవ్వసాచి