గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ ఛాన్స్‌!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు మంచి లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 70 పాయింట్లు పెరిగి 10,485 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. గురువారం ఆద్యంతం స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కదిలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి.

బుధవారం లాభాల హైజంప్ చేయడంతో మార్కెట్లు రోజంతా కన్సాలిడేట్‌ అయ్యాయి. చివరికి సెన్సెక్స్‌ 10 పాయింట్లు క్షీణించి 34,432 వద్ద నిలవగా.. నిఫ్టీ 6 పాయింట్లు బలహీనపడి 10,380 వద్ద స్థిరపడింది. కాగా.. వరుసగా మూడో రోజు గురువారం మరోసారి అమెరికా స్టాక్‌ మార్కెట్లు 1-2 శాతం మధ్య లాభపడ్డాయి. ప్రస్తుతం ఆసియాలోనూ అన్ని మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. దీంతో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా కదిలే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

Image result for stock investors india

నిఫ్టీ కదలికలు ఇలా..! 
నేడు నిఫ్టీ బలహీనపడితే తొలుత 10,334 పాయింట్ల వద్ద, తదుపరి 10,288 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 10,434 పాయింట్ల వద్ద, తదుపరి 10,488 స్థాయిలోనూ అవరోధాలు ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 25168, 25012 వద్ద మద్దతు లభించవచ్చని, 25440, 25557 వద్ద రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు.

డీఐఐల అమ్మకాలు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 349 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 509 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. కాగా.. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 194 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1125 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి.

Also Read : 10 నిమిషాల్లో 50 వార్తలు..