మడతబెట్టే స్మార్ట్ ఫోన్ వచ్చేసింది..

curuved smart phone coming

మారుతున్న కాలానికనుగుణంగా టెక్నాలజీ రంగంలో కూడా వేగంగా మార్పులు జరుగుతున్నాయి. ఒకప్పుడు ల్యాండ్ ఫోన్ తో మొదలై.. లార్జ్ బేసిక్ ఫోన్ దశ నుంచి స్మార్ట్ ఫోన్ వరకు రాగా.. తాజాగా మొబైల్ ఫోన్ రంగంలో మరో కొత్త టెక్నాలజీ వచ్చి చేరింది. ప్రపంచంలోనే మొట్టమొదటి మడతబెట్టే స్మార్ట్‌ఫోన్‌ను చైనాకు చెందిన రాయొలే కార్పొరేషన్‌ శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా మడతబెట్టే స్మార్ట్ ఫోన్ కోసం దిగ్గజాలైన శామ్‌సంగ్‌, ఎల్‌జీ, హువావే లాంటి సంస్థలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో రాయొలే కంపెనీ ఈ మడతబెట్టే స్మార్ట్ ఫోన్ ను తొలిసారిగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘ఫ్లెక్స్‌పై’ పేరుతో శుక్రవారం నుంచే ఈ ఫోన్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది.

Also read : పోలవరం ప్రాజెక్టు చెక్‌పోస్ట్ వద్ద కుంగిన రహదారి

7.8 అంగుళాలతో మినీ ట్యాబ్‌లా ఉండే ఈ ఫోన్‌ సగభాగాన్ని మడతబెట్టొచ్చు. మడిచిన తర్వాత ఇది డ్యుయల్‌ స్క్రీన్‌ స్మార్ట్‌ ఫోన్ లా కనిపిస్తుంది. ఇందులో సరికొత్త స్క్రీనింగ్ సిస్టమ్స్, అధునాతన కెమెరా, కరువుడ్ స్క్రీన్ ఉన్నాయి. ఈ ఫోన్ లో రెండు కెమెరాలున్నాయి. ఒకటేమో 20మెగాపిక్సెల్‌ టెలిఫొటో లెన్స్‌తో పాటు మరొకటి 16మెగాపిక్సెల్‌ వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌లు. రెండేళ్ల వ్యవధిలో దాదాపు 2లక్షల సార్లు పరీక్షించిన తరువాత చైనా సంస్థ ఈ ఫోన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది చైనా సంస్థ. కాగా ఈ ఫోన్ ఫీచర్లు చూస్తే.. క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8150 ప్రాసెసర్‌ తోపాటు 6జీబీ మరియు 8జీబీ ర్యామ్‌, 128జీబీ/256జీబీ/512జీబీ ఇంటర్నల్ మెమొరీ, 3,800ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం గల ఫీచర్లు ఉన్నాయి.128జీబీ ఇంటర్నల్‌ మెమొరీ సామర్థ్యం గల ఫోన్‌ ధర 1,318 డాలర్లు, 256జీబీ ఇంటర్నల్‌ మెమొరీ సామర్థ్యం గల ఫోన్‌ ధర 1,469డాలర్లుగా రాయొలే స్మార్ట్ ఫోన్ కంపెనీ నిర్ణయించింది.