ఫ్లిప్‌కార్ట్‌ దివాలి ఆఫర్..

flipkart-big-diwali-sale-best-deals-top-selling-smartphone

ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మరోసారి వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ దివాలి పండగకు ఆకర్షణీయమైన ఆఫర్లతో ‘బిగ్‌ దివాలీ సేల్‌’ ను మొదలుపెట్టింది. నవంబరు 1నుంచి 5వతేదీ వరకు నిర్వహిస్తున్న బిగ్‌ దివాలీ సేల్‌లో భాగంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన తగ్గింపు ధరలు ప్రకటించింది. అందులో శాంసంగ్‌ , హానర్‌ స్మార్ట్‌ఫోన్లపై ఏకంగా 50 శాతం తగ్గింపు ప్రకటించింది.

శాంసంగ్‌ గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌: 3జీబీ/64జీబీ వేరియంట్‌ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ. 9,999కే లభిస్తుంది. దీని అసలు ధర : 17,999 గా ఉండగా సగానికి తగ్గించింది.

అలాగే హానర్‌ (6జీబీ/128జీబీ) ఫోన్ కేవలం రూ.24,999 కే వస్తుంది. దీని అసలు ధర రూ.32,999 గా ఉంది. దీనికి కూడా 50శాతం డిస్కౌంట్‌ వస్తుంది. ఎస్‌బీఐ కార్డు కొనుగోలుపై 10శాతం డిస్కౌంట్‌ అదనంగా లభిస్తుంది అని ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. వీటితోపాటు నోకియా 5.1‍ ప్లస్‌, మోటో, రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లు కూడా డిస్కౌంట్‌ ధరల్లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి. ఈనెల ఒకటవ తేదీన అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫర్ మరెన్నో ఆకర్షణీయమైన ఆఫర్లను ఇస్తోంది.

Also Read : కేంద్రం కీలక నిర్ణయం.. 59 నిమిషాల్లోనే కోటి రూపాయల రుణం