మత బృందంతో వెళ్తున్న బస్సుపై కాల్పులు

ఈజిప్టు రాజధాని కైరోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మత బృందం వెళ్తున్న బస్సుపై దుండగులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 16 మందికి గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మిన్యా సిటీకి సమీపంలో ఉన్న సెయింట్ సామ్యుల్ మానెస్టరీ నుంచి బస్సు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నది. దీనికి బాధ్యులుగా పేర్కొంటూ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రకటన విడుదల చేసింది. అయితే.. కాల్పులకు గల కారణాన్ని మాత్రం ఐసీస్ వెల్లడించలేదు.