ఆ మూవీలో ‘సూర్య’కు తండ్రిగా నటించనున్న ‘కమల్’?

‘సింగం’ సూర్య ఈమద్య బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సూర్య చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలపై కూడా తమిళ ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అందుకు కారణం ఆయా సినిమాల కాస్టింగ్ తో పాటు, డైరెక్టర్ల క్రేజ్ కూడా ఒకటి.

ప్రస్తుతం సూర్య నటించిన ఎన్.జి.కె చిత్రం రిలీజ్ కి రెడీ అయ్యింది. సెల్వరాఘవన్ ఈ చిత్రానికి డైరెక్టర్. ఈ మూవీ రాకముందే కె.వి.ఆనంద్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇందులో మోహన్ లాల్ కీ రోల్ పోషిస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

Also Read : రజనీకాంత్ “2.O” మూవీ ట్రైలర్ విడుదల

ఇక సూర్య 38వ చిత్రంగా మరో క్రేజీ కాంబినేషన్ సెట్ చేస్తోన్నట్లు టాక్. కమల్ హాసన్ నటించి, నిర్మించిన ‘దేవరమగన్’ మూవీని సూర్య రీమేక్ చేస్తున్నాడనే వార్త సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

‘దేవరమగన్’ మూవీ అప్పట్లో ‘క్షత్రియపుత్రుడు’గా తెలుగులోనూ విడుదలైంది. ఇప్పుడు ఆ సినిమాని సూర్య అదే పేరుతో రీమేక్ చేయబోతున్నట్లు సమాచారం. తెలుగులో ‘క్షత్రియ పుత్రుడు2’ గా విడుదల చేయబోతున్నట్లు చిత్రపరిశ్రమల్లో బలంగా వినిపిస్తోంది.

ఈ మూవీలో కమల్ హాసన్ పాత్రలో సూర్య కనిపించబోతున్నాడు. ఇక కమల్ హాసన్ తండ్రి పాత్ర పోషించిన శివాజీ గణేషన్ రోల్ లో, కమల్ హాసన్ నటించే ఆవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సూర్యకు తండ్రిగా కమల్ హాసన్ నటించబోతున్నాడనే వార్త అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారింది.