నైన్త్ క్లాస్ స్టూడెంట్ తన ప్రేమను నిరాకరించిందని.. టీచర్ చేసిన పని..

man hulchal in begumpet police station

చదువు చెప్పాల్సిన మాస్టారు దారి తప్పాడు. ప్రేమించలేదని అక్కసుతో స్టూడెంట్ పై బ్లేడుతో దాడికి తెగబడ్డాడు. కర్నూలు గుడ్ షెపర్డ్ స్కూల్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. బాలికపై దాడికి పాల్పడిన ఆ సైకో సార్ ను జనం చితగ్గొట్టారు. హింది టీచర్ చేతిలో తీవ్రంగా గాయపడిన పల్లవి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

చదవుతో పాటు సంస్కారం నేర్పాల్సిన హైస్కూల్ టీచర్లే ఉన్మాదులుగా మారుతున్నారు. తెలిసి తెలియని వయస్సులో ప్రేమతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించాల్సిన సారు బుద్ధే తప్పుదారి పట్టింది. గురు శిష్యుల బంధాన్ని మరిచి తొమ్మిదో తరగతి చదువుతున్న అమ్మాయిపై కన్నేశాడు హిందీ టీచర్ శంకర్. అతని ప్రేమను నిరాకరించటంతో రాక్షసుడిలా మారిపోయాడు. ఆమెపై బ్లేడుతో దాడి చేసి చంపబోయాడా సైకో సారు.

కర్నూలులో గుడ్ షెపర్డ్ స్కూల్ లో చోటు చేసుకున్న దారుణం ఇది. నైన్త్ స్టాండెర్డ్ లో ఉన్న పల్లవిని ప్రేమించాలంటూ వెంటబడ్డాడు. లేదంటే పరీక్షలో ఫెయిల్ చేస్తానంటూ వేధించటం ప్రారంభించాడు. శంకర్ వేధింపులు ఎక్కువ కావటంతో ఆ బాధితురాలు విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో మస్టారును మంచిగానే మందలించి వెళ్లారు ఆ అమ్మాయి తల్లిదండ్రులు. ఇంకోసారి రిపీట్ అయితే పోలీసులకు చెప్తామని హెచ్చరించారు. దీంతో పల్లవిపై కోపం పెంచుకున్న శంకర్..ఫుల్లుగా మందుకొట్టి ఇంట్లో ఒంటరిగా ఉన్న పల్లవిపై బ్లేడుతో దాడి చేశాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. అప్పటికే అక్కడి చేరుకున్న స్థానికులు శంకర్‌ను పట్టుకొని చితగ్గొట్టారు.

హిందీ టీచర్ శంకర్ చేతిలో గాయపడిన పల్లవి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మరోవైపు స్థానికుల దాడిలో గాయపడిన శంకర్ ను కూడా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.