విద్యార్థినిపై టీచర్ బ్లేడ్ తో దాడి..

teacher murder attemt on student in kurnool distric

కర్నూలు నగరంలో దారుణం చోటు చేసుకుంది. గుడ్‌ షెపర్డ్‌ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై.. అదే స్కూల్‌లో హిందీ టీచర్‌గా పనిచేస్తున్న శంకర్‌ బ్లేడ్‌తో దాడికి పాల్పడ్డాడు. అమ్మాయిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. 9వ తరగతి చదువుతున్న స్టూడెంట్‌ను కొంతకాలంగా హిందీ టీచర్‌ శంకర్ ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఏడాదిగా విద్యార్థినిపై కన్నేశాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబం.. ఆ ఉపాధ్యాయుడిని మందలించి వదిలిపెట్టింది. పోలీసుల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. అయినా.. ఆ టీచర్‌ బుద్ది మార్చుకోకుండా విద్యార్థినిపై వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఆమె తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో బ్లేడ్ తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : మారణహోమం..ఐదుగురు యువకుల కాల్చివేత