ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు..వాళ్ళను కాల్చి పారేస్తాం…!

మెక్సికో అక్రమ వలసదారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ హెచ్చరికలు జారీ చేశారు. సరిహద్దుల్లో భద్రతా దళాలపైకి రాళ్లు విసిరితే కాల్చిపారేస్తామని బెదిరించారు. వలసవాసులు మారణాయుధాలతో అమెరికా సరిహద్దులకు చేరుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు.

అమెరికాలోని వలస ప్రజల పట్ల కత్తిగట్టిన అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్.. మధ్యకాలిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరో కొత్త అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జన్మతః పౌరసత్వపు హక్కుకు ఎసరు పెట్టాలని డిసైడైన ట్రంప్‌… తాజాగా మెక్సికో నుంచి వచ్చే అక్రమ వలసదారులను కాల్చి చంపేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు.

రాహుల్‌తో కోదండరాం భేటీ..మా దారి మేం చూసుకుంటామంటూ..

కొంతకాలంగా మధ్య అమెరికాకు చెందిన వలసదారులు మెక్సికో మీదుగా అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. మెక్సికో దగ్గర సరిహద్దు దాటే సమయంలో భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వుతున్నారు. ఈ క్రమంలో వారిని హెచ్చరించేలా డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెక్సికో సరిహద్దు దగ్గర ఉండే సైనికులపై రాళ్లు రువ్వితే కాల్పులు జరుపుతామని స్పష్టం చేశారు. వలసదారులు అక్రమంగా సరిహద్దు దాటే సమయంలో రాళ్లు విసిరతే.. వారిని కాల్చేయాలంటూ ట్రంప్‌ సైనికులకు సూచించారు. అక్రమ వలసదారుల వల్ల రకరకాల ముప్పులు పొంచి ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఆర్థిక సంక్షోభం కారణంగా హోండూరస్ దేశానికి చెందిన వేల మంది ప్రజలు.. అమెరికా ఆశ్రయం కోసం అమెరికా-మెక్సికో సరిహద్దు వైపు వస్తున్నారు. ఈ నేపథ్యంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ట్రంప్.. అమెరికన్లలో తీవ్ర ఆందోళనను రేకెత్తించారు.