కోట్లున్నా యాచించడం అంటే ఇదేనేమో..!

rich-women-doing-begging

కోట్లున్న యాచించడం ఎందుకనే సామెత వినే ఉంటారు. కొంతమంది డబ్బే పరమావధిగా ఎప్పుడు అదే ధ్యాసలో ఉంటారు. కోట్లాది రూపాయలు ఉన్నా చెయ్యిచాచి అడిగే మహానుభావులు సమాజంలో ఉంటారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు ‘బియు’ దేశం చైనా.. వయసు 79 సంవత్సరాలు. ఆమె భర్త కొన్నేళ్ల కిందటే మరణించాడు. తన ఒక్కగానొక్క కొడుకు వద్దే ఉంటుంది. ఆమె పేరిట తన భర్త.. ఓ విల్లా, కారు, బంగారు నగలు ఉంచాడు. కానీ వాటిని వదులుకుని ఆమె హాంగ్‌జూ రైల్వేస్టేషన్‌లో యాచిస్తుంది. ఆమె కొడుకు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా యాచించడం చేస్తోంది.

Also Read : అప్పుడే మొత్తం జాబితా విడుదల చేయాలని నిర్ణయం

దాంతో అతను రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారు ఆమె పరిస్థితిని చూసి హతాశులయ్యారు.. ఇదేం ఖర్మ అనుకున్నారు.. దాంతో ఆమెకోసం కొన్ని పోస్టర్లు సిద్ధం చేశారు. వాటిలో ‘ఆమెకెవ్వరూ సాయం చేయకండి! ఆమె చెప్పే కథలకు కరిగిపోకండి.. మీకు కనిపిస్తున్నంత అమాయకురాలు కాదు. ఆమె ధనవంతురాలు, ఐదంతస్తుల విల్లాలో నివసిస్తుంది.. దయచేసి ఆమెకు సాయం చేయకండి’ అని రాసి ఉంది. ఆమె వయసు,అవతారం చూసి జనాలు జాలితో దానం చేసి వెళుతున్నారు. మొదట్లో ఈమె గురించి తెలియని వాళ్ళు అయ్యో పాపం అని అనుకుంటారు.. తరువాత అసలు వ్యవహారం తెలుసుకుని ఇదేం పని అనుకోవడం చేస్తున్నారు.