పిడుగు ఎలా పుడుతుందంటే..

Thunder falling on the ground

మేఘాలు ఒక దానితో ఒకటి ఢీకొన్న ప్పుడు కలిగిన ఘర్షణ వల్ల విద్యుత్‌ పుడుతుంది. అలా విడుదలైన విద్యుత్‌ భూమి పైన ఖాళీ ప్రదేశాలలో లేదా ఎత్తయిన ప్రదేశాలపై ప్రసరిస్తుంది. దీనినే పిడుగు పడడం అంటారు. పిడుగు పడిందంటే ఆప్రాంతంలో ఉన్న ఏవైనా మాడిమసై పోవాల్సిందే. ఆ సమయంలో కొన్ని లక్షల ఓల్టుల విద్యుత్‌ తరంగాలు మేఘాల నుంచి భూమిలోకి ప్రవహిస్తుంది.

వాస్తవంగా ధ్వనికన్నా కాంతివేగం ఎక్కవ వేగంతో వెళుతుంది కనుక మెరుపు మొదటగా కనిపించి ఆ తర్వాత ఉరుము వినిపిస్తుంది. మేఘాల ఒరిపిడి తీవ్రతను బట్టి పిడుగు శబ్దం వినిపిస్తుంది. పిడుగుకు రూపం లేదు. కొంతమంది పూర్వికులు చెప్పినట్టు ఇదేమి ఇనుప కడ్డీ కాదు.. ఇతర లోహం అంతకన్నా కాదు. మేఘంలో ఉన్న రుణ విద్యుదావేశం భూమిని తాకినప్పుడు వచ్చే మెరుపే పిడుగు. ఉష్ణోగ్రతలు తీవ్రతరం అయినప్పుడు నీరు ఆవిరిగా మారి దాదాపు 25 వేల అడుగుల ఎత్తు వరకు మేఘాలు ఏర్పడతాయి. అలా ఏర్పడే మేఘంలో రెండు భాగాలుంటాయి. పైన ఉన్న భాగం పాజిటివ్‌ చార్జ్‌ ను కలిగి ఉంటే కింది భాగం నెగిటివ్‌ చార్జ్‌ ను కలిగి ఉంటుంది. మబ్బుల్లోని నెగిటివ్‌ ఎనర్జీ, పక్క మేఘంలోని పాజిటివ్‌ ఎనర్జీకి తాకితే మెరుపులు సంభావిస్తాయి. ఒకవేళ ఆ నెగిటివ్‌ ఎనర్జీ భూమి మీది పాజిటివ్‌ ఎనర్జీని చేరుకుంటే అది పిడుగుపాటు అవుతుంది.

అయితే మేఘాల్లోనూ ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు ఉంటాయి. ప్రోటాన్లు పాజిటివ్‌ ఎనర్జీని, ఎలక్ట్రాన్లు నెగిటివ్‌ ఎనర్జీని కలిగి ఉంటాయి. మేఘాలు ఒక చోట నుంచి మరోచోటికి వెళ్లే సమయాల్లో ఆ మేఘాల్లో నీరు ఘనీభవించి మంచుగా మారుతుంది. అలా ఏర్పడే మంచు గడ్డలు ఒకదానికొకటి ఢీకొని పాజిటివ్‌ ఎనర్జీ ఉండే ప్రోటాన్లు, మేఘం పై భాగానికి చేరతాయి. ఇక నెగిటివ్‌ ఎనర్జీ ఉంటే ఎలక్ట్రాన్లు మేఘాలు కింది భాగానికి చేరుకుంటాయి. వీటిని భూమిపై ఉండే పాజిటివ్‌ ఎనర్జీ కలిగిన ప్రోటాన్లు ఆకర్షిస్తే పిడుగులు పడతాయి. భూమి మీద ఎత్తుగా కనిపించే కొండలు, చెట్లు, మనుషుల, అలాగే ఎత్తైన గోపురాలు ఇవి ఆకర్షిస్తాయి. తద్వారా ఆ ప్రదేశాల్లో పిడుగులు పడతాయని మనకు శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అందువల్ల వర్షాలు పడే సమయాల్లో ఒంటరిగా ఎత్తైన ప్రదేశాల్లో ఉండరాదని వారు చెబుతుంటారు.