భారీ భూకంపం.. దద్దరిల్లిన..

massive-earthquake-fij

గ్రీస్‌లో భారీ భూకంపం సంభవించింది. జకింతోస్‌ ఐలాండ్‌లో భూప్రకంపనలతో దద్దరిల్లింది. దీంతో ఇళ్లలో ఉన్న జనం భయంతో బయటకు పరుగులు పెట్టారు. దాదాపు ఆ ప్రాంతంలోని ఇళ్లన్ని ఖాళీ చేశారు. ఏడు నిమిషాల వ్యవధిలోనే రెండు సార్లు భూకంపం సంభవించడం స్థానికులను భయాందోళనకు గురి చేసింది.

భూకంపప్రభావంతో పలు భవనాలు దెబ్బతిన్నాయి. ఇళ్లలోని వస్తువులన్ని చిందరవందరగా పడిపోయాయి. పోర్టు సమీపంలో భూమి పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో గ్రీస్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించింది.