ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది అక్కడికక్కడే..

road, accident, car, lorry

హర్యానాలోని సోనిపట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్‌లో వేగంగా ప్రయాణిస్తున్న ఓ ట్రక్కు అదుపు తప్పి కారు, రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొంది. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఖానాపూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

ట్రక్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్టు సమాచారం. అతి వేగం ప్రమాదమని తెలిసినా డ్రైవర్‌ అత్యంత వేగంగా వాహనాన్ని నడిపి 13 మంది మృతికి కారకుడయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.