ఐసీయూలో చికిత్స పొందుతున్న మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం

ఉత్తరప్రదేశ్‌లో అత్యంత దారుణం జరిగింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు కీచకులు. యూపీలోని బరేల్లీలోని ప్రాంతానికి చెందిన ఓ ఎనిమిదేళ్ల బాలికను పాము కాటేసింది. దీంతో ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స కోసం ఐసీయూలోకి బాలికను తరలించారు.

అదే రోజు రాత్రి ఆస్పత్రిలో పనిచేసే ఓ వ్యక్తి, అతడికి తెలిసిన మరో నలుగురుతో కలిసి ఐసీయూలోకి చొరబడి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని బాలికను బెదిరించారు. మరుచటి తనను జనరల్‌వార్డుకు తరలించిన తరువాత తల్లి దండ్రులకు విషయం చెప్పడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకొని బాలికను విచారించి కేసు నమోదు చేసుకున్నారు. ఆస్పత్రికి చెందిన సిబ్బంది ఒకరు, మరో నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.