ఆపదలో ఉన్నానని పిలిచి.. ఆనక బట్టలిప్పి లొల్లి.. వీడియో వైరల్

మామూలుగా ఉంటేనే ఒక్కోసారి విచక్షణ కోల్పోతుంటారు. ఇక మందేస్తే.. మత్తు మైండ్‌కి ఎక్కి తలతిక్క పనులు చాలా చేసేస్తుంటారు. అయితే ఇక్కడ ఈ పని చేసింది పురుష పుంగవుడు కాదు. అచ్చంగా పదహారణాల పడుచు పిల్ల. కంటెంట్ రైటర్‌గా, మోడల్‌గా పని చేస్తున్న మేఘా శర్మ ముంబైలోని లోఖండ్‌వాలాలో పేయింగ్ గెస్ట్‌(పీజీ)గా ఉంటోంది.

తన కార్యక్రమాలు ముగించుకుని అర్థరాత్రి ఒంటి గంట సమయంలో పీజీకి వచ్చిన ఆమె అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డుని సిగరెట్లు తెమ్మని అడిగింది. అందుకు సెక్యూరిటీ ఈ టైమ్‌లో వెళ్లడం కుదరదంటూ బదులిచ్చాడు. అసలే మద్యం మత్తులో ఉన్న మేఘ సిగరెట్లు తీసుకురాననే సరికి సెక్యూరిటీతో గొడవకు దిగింది. ఆపై 100కు ఫోన్ చేసి సెక్యూరిటీ తనపై అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఫిర్యాదు చేసింది.

ఆమె ఫోన్ కాల్ అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తాగిన మత్తులో ఆ యువతి ప్రవర్తననే తప్పుగా భావించారు పోలీసులు. ఆమెను పోలీసులు తమతో స్టేషన్‌కు రావలసిందిగా ఆదేశించారు. న్యాయం చేస్తారని పిలిస్తే నన్నే స్టేషన్‌కి రమ్మంటారా అంటూ వారిమీద కూడా విరుచుకు పడింది. పోలీసులపై, సెక్యూరిటీ గార్డుపై ఇష్టం వచ్చినట్లు అరిచింది. అపార్ట్ మెంట్ లిప్టులోకి వెళ్లి బట్టలు విప్పి లో దుస్తులు మాత్రం ఉంచుకుని ఇప్పుడు తీసుకు వెళ్లండి అంటూ వీరంగం సృష్టించింది. అలానే బయటకు వచ్చి మరో సెక్యూరిటీ గార్డుపై కూడా దాడికి దిగింది.

పోలీసులు తమ వెంట మహిళా పోలీసుని తీసుకు వెళ్లకపోవడంతో వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆమెకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పోలీసులు వెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదు. అయితే అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ ఘటన అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. మేఘా శర్మ కూడా శనివారం పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిలను ట్యాగ్ చేస్తూ తన ఆవేదనను ట్వి్ట్టర్‌లో పోస్ట్ చేసింది.

Read Also:హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబు రికార్డులు మరిన్ని బయటపెడతా

అర్థరాత్రి ఆపదలో ఉన్నానంటూ ఓ మహిళ ఫోన్ చేస్తే వారు లేడీ పోలీస్ లేకుండా వచ్చి స్టేషన్‌కు ఎలా రమ్మంటారంటూ ప్రశ్నించింది. నిజానికి చట్ట ప్రకారం కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్‌లోని సెక్షన్ 160 కింద ఒక మహిళను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు పిలవకూడదు. ఆమె ఇంట్లోనే కుటుంబ సభ్యుల సమక్షంలో మహిళా కానిస్టేబుల్ విచారణ జరపాలి. అంతే కాకుండా, సుప్రీం కోర్టు మార్గనిర్ధేశాల ప్రకారం సూర్యాస్తమయం తరువాత, సూర్యోదయానికి ముందు మహిళను అరెస్టు చేయడానికి వీల్లేదు.