తిరుమలలో లడ్డూ స్కామ్‌ సూత్రదారుల డొంక కదులుతోంది

laddu-scam-investigation-in-thirumala

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో వెలుగు చూసిన లడ్డూ స్కామ్‌పై సూత్రదారుల డొంక కదులుతోంది. ఈ స్కామ్‌లో లడ్డూ కౌంటర్‌లో పనిచేస్తున్న వివిధ బ్యాంకులకు చెందిన ముప్పై మందికిపైగా కాంట్రాక్ట్‌ ఉద్యో ులు ఉన్నట్లు టీటీడీ విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. సామాన్య భక్తులకు ఇచ్చే ఇరువై ఐదు వేల లడ్డూలను పక్క దారి పట్టించినట్లు తేలింది. గతంలో కూడా అనేక సార్లు లడ్డూ కౌంటర్‌లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు శ్రీవారి సేవకు వచ్చే భక్తులను అడ్డుపెట్టుకుని లడ్డూలను బయటకు పంపిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో టీటీడీ తిరుమల 1వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ భావిస్తోంది.

Also read : ఏపీలోని గ్రామీణప్రాంత ప్రజలకు శుభవార్త

సాధారణంగా శ్రీవారి సర్వ దర్శనానికి వెళ్లిన సామన్య భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో డెబ్బై రూపాయలకు మొత్తం నాలుగు లడ్డూలను అందించడం జరుగుతుంది. అయితే ఆటోకెన్‌కు సంబంధిం స్కాన్‌ కాకపోతేల ఆటోకెన్‌లో చివరిలో ఉన్న ఆరు నెంబర్‌లను నమోదు చేసుకుని భక్తులకు లడ్డూలను ఇస్తారు..

అయితే నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో గరుడ సేవ రోజు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఆసౌకర్యం కలగకుండా ఉండాలని టీటీపీ లడ్డూ కౌంటర్‌లోని అధికారులకు లడ్డూ టోకెన్ స్కాన్ కాకపోయినా లడ్డూలను అందించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిని ఆసరాగా తీసుకున్న లడ్డూ సిబ్బంది భారీ స్కామ్‌కు పాల్పడ్డారు.. దీనిపై విచారించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు సంబంధించిన ఉద్యోగులపై టీటీడీకి ఫిర్యాదు చేసింది. ఈస్కామ్‌లో ఉన్న ముప్పై మందికి పైగా ఉన్న పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిపై చర్యలు తీసుకునేందుకు టీటీడీ నిర్ణయించింది.