వివాహేతర సంబంధం : భర్తను హతమార్చిన భార్య

murder-mystery-reveals-after-five-months-chittoor

వివాహేతర సంబంధం కారణంగా ఓ మహిళ తన భర్తను హతమార్చింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. తంబళ్లపల్లె మండలం కోటకొండ గ్రామా సమీపంలోని ఎగువతండాకు చెందిన రమణమ్మ(45), బుక్యామారూనాయక్‌ (60) దంపతులు. రమణమ్మకు సమీప గ్రామానికి గ్రామం బందార్లపల్లెకు చెందిన మదన్‌మోహన్‌రెడ్డితో కొన్నేళ్లుగా వివాహేతర ఉంది. ఇదే విషయమై రమణమ్మ, బుక్యామారూనాయక్‌ దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. అయితే మద్యం తాగి వేధించడంతో విసుగు చెందిన రమణమ్మ భర్తను హతమార్చాలని ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా గత నెల మే నెల 25వ తేదీన ఇంటిలోనే మద్యం తాగుతున్న భర్తతో గొడవపడింది. ఆ తరువాత గడువు తీరిన పలురకాల మాత్రలను పొడి చేసి మద్యంలో కలిపింది.

Also read : ఇంట్లోకి ఆగంతకుడు అందుకే వచ్చాడు : ప్రణయ్‌ భార్య అమృత

ఇది గమనించని బుక్యామారూనాయక్‌ మద్యాన్ని సేవించాడు. దాంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లపోయాడు. కొంతసేపటికి మరణించాడు. ఈ విషయాన్ని ప్రియుడు మదన్‌మోహన్‌రెడ్డికి ఫోన్‌లో సమాచారం అందించింది రమణమ్మ. మదన్‌మోహన్‌రెడ్డి మరో వ్యక్తి సుబ్బారెడ్డి సాయంతో అర్ధరాత్రి సమయంలో మృతదేహాన్ని సంచిలో మూట కట్టి ట్రాక్టర్‌లో తీసుకెళ్లి వాగులో పాతిపెట్టారు. అదే నెల 29వ తేదీ రమణమ్మ, కుమారుడు హరినాయక్‌తో కలిసి భర్త అదృశ్యమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ వ్యవహారంపై అనుమానం చెందిన పోలీసులు ఆమెను విచారించగా హత్య విషయం బయటపెట్టింది. ఇక పోలీసులు ఈ కేసును హత్యకేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.