‘సర్కార్’ మూవీ రివ్యూ

sarkar-movie-review

కుమార్ శ్రీరామనేని

తుపాకీ సినిమా తో తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గర అయిన విజయ్ పోలీస్, అదిరింది సినిమాలతో మార్కెట్ ని పెంచుకునే ప్రయత్నం చేసాడు. మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే లక్షణాలు పుష్కలంగా ఉన్న ఈ తమిళ్ సూపర్ స్టార్ మురుగుదాస్ తో కలసి సర్కార్ ని దీపావళికి తెలుగు ప్రేక్షకులకు అందించాడు. మరి సర్కార్ ఎలాంటి ఎక్స్ పీరియన్స్ లను అందించాడో చూద్దాం.

కథ:
రామస్వామి(విజయ్) ఒక కార్పోరేట్ సంస్థకు అధిపతి. కార్పోరేట్ రాజకీయాలలో దిట్ట అయిన రామస్వామి తన ప్రత్యర్ధులను అణివేచయడంలో ముందుంటాడు. తన ఓటు హాక్కును వినియోగించుకునేందుకు సొంత గడ్డ పై అడుగు పెట్టిన రామస్వామికి తన ఓటు ని ఎవరో వేసారు అని తెలుస్తుంది. తన ఓటు పడకుండా ఆ నియోజక వర్గం లో ఓట్లు ఫలితాలు వెల్లడించకూడదని కోర్ట్ కి వెళతాడు. అక్కడ నుండి రామస్వామి ఒక పొలిటికల్ గేమ్ ఆడటం మొదలు పెడతాడు. అసలు రామస్వామి లక్ష్యం ఏంటి..? తను ఎందుకు ఒక ఓటు కోసం ఇంత పోరాటానికి దిగాడు..? రాజకీయ వ్యవస్థలో రామస్వామి తెచ్చిన మార్పులేమిటి అనేది మిగిలిన కథ..?

కథనం:
ఓటు అనేది ప్రజాస్వామ్యం అందించిన ఆస్థి ఆ ఆస్థిని ఎవరో దొంగిలిస్తే అసలు ఊరుకోకూడదు. అది మన హాక్కు, ఈ పాయింట్ తో మొదలైన సర్కార్ ప్రజలకు కొత్త గా అనిపించాడు. వేల కోట్ల సంస్థకు అధిపతిగా చాలా ప్రామిసింగ్ అనిపించాడు. అతని ఇంట్రడక్షన్ పాట తమిళకు అవసరం ఏమో కానీ ఇక్కడ మాత్రం పెద్దగా ఉపయోగం ఉండదు. పెద్దగా లేట్ చేయకుండా తన అనుకున్న పాయింట్ లోకి వచ్చేసాడు మురుగుదాస్. తన ఓటును కోల్పోయిన రామస్వామి పోరాటం కొత్తగా అపిపించింది. ఒక ఓటు తో మొదలైన ఆ పోరాటం సియమ్ పదవీ ప్రమాణ స్వీకారాన్ని ఆపగలిగేంత శక్తి వంతంగా తయారయ్యింది. ఈ క్రమంలో మురుగుదాస్ పేర్చుకున్న సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రెస్ మీట్ నుండి రాధారవి తో మీటింగ్ సన్నివేవం వరకూ చాలా ఎఫెక్టివ్ గా నడిపాడు. ఓటు కోసమే తను ఫోరాటం చేయడంలేదు వ్యవస్థను సమూలంగా మార్చాలని ప్రయత్నిస్తున్నాడు అనే పాయింట్ ని తీసుకు వెళ్లడానికి దర్శకుడు తీసుకున్న టర్న్స్ బాగున్నాయి. సినిమాలోని కంటెంట్ ను హీరోకుండే యాక్షన్ ఇమేజ్ ని బాలెన్స్ చేస్తూ కథను ఆసక్తిగా నడిపాడు దర్శకుడు. రెహామాన్ పాటలు పెద్దగా వర్క్ అవుట్ అవలేదు. ఇక సెకండాఫ్ కొచ్చే సరికి కంప్లీట్ సర్కార్ కంప్లీట్ పొలిటికల్ డ్రామాగా మారింది. అక్కడే కాన్పెప్ట్ కొత్త గా ఉన్నా దర్శకుడు పాత దారిలోకి వచ్చాడు అనే ఫీల్ కలిగింది. పొలిటికల్ డ్రామా లో ఎత్తులు పై ఎత్తులు చాలా చూసాం. సర్కార్ కథ కూడా అటువంటి అలవాటు అయిన దారిలోనే ప్రయాణం చేసింది. ఒక సియమ్ ని అతని పార్టీని పూర్తిగా ధ్వంసం చేసేందుకు హీరో చేసిన పనులు ఇప్పటి వరకూ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలలో కనిపించినవే. అందుకే అవి ఏ మాత్రం ఆసక్తిగా మారలేదు. హీరోతన పుట్టుకు గురించి చెప్పే ఎమోషనల్ సీన్ బాగుంది. మిగిలినదంగా రోటీన్ పోలిటికల్ డ్రామా గా ఉంది. కీర్తి సురేష్ పాత్ర కథకు కానీ, హీరోకి కానీ పెద్దగా కనెక్ట్ అవలేదు. ఎందుకంటే కేవలం స్ర్కీన్ గ్లామర్ కోసమే ఆ పాత్రను హీరో పక్కన తిప్పాడు దర్శకుడు. లవ్ ట్రాక్ హీరోయిన్ వైపు నుండే ఉంటుంది కాబట్టి రెండు పాటలకు ఆ ప్రేమ పనికి వచ్చింది. ఒక కొత్త పాయింట్ తో మొదలైన సర్కార్ రోటీన్ పొలిటికల్ డ్రామాలో పడిపోయాడు. ఇక వరలక్ష్మి పాత్ర కూడా పెద్ద టఫ్ ఫైట్ ఇవ్వలేకపోయింది. సర్కార్ కి ఉన్న ప్రధాన మైన సమస్య అతనికి యాక్టివ్ అండ్ స్ట్రాంగ్ ప్రతి నాయకుడు లేకపోవడమే, రాధారవి, వరలక్ష్మి పాత్రలు హీరో కు పెద్ద సమస్య గా మారలేకపోవడం సర్కార్ కథనాన్ని ఆసక్తిగా మార్చలేకపోయింది. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి ఆయుధం. దేశ భవిష్యత్ ని మార్చే ఆ ఆయుధాన్ని ఉపయోగించుకోకపోవడం పెద్ద నేరం. ఈ పాయింట్ తో మొదలైన కథ ను రోటీన్ పొలిటికల్ డ్రామాగా మారడం తో సర్కార్ కూడా రోటీన్ గా అనిపించాడు.

చివరిగా:
బోరింగ్ పొలిటికల్ డ్రామా