గుండమ్మకథలో బుల్లెమ్మ.. ఎన్టీఆర్‌లో ఈ చిన్నమ్మ

మహానటి సావిత్రి చిత్రాలన్నీ మహోన్నతమైనవే. ఆమె నటించిన చిత్రాలన్నీ వేటికవే సాటి. ఇండస్ట్రీలో అతిరధ మహారధులుగా చెప్పుకునే ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, జమున, సూర్యకాంతం, ఎస్వీరంగారావులాంటి మహామహులున్న చిత్రం గుండమ్మకథ. ఎప్పుడు చూసినా కొత్తగా ఉంటుంది.

Also Read : ‘సర్కార్’ మూవీ రివ్యూ

ఈ చిత్రంలోని పాటలు ఎన్ని సార్లు విన్నా చెవులకు ఇంపుగానే ఉంటాయి. మరి ఆ చిత్రంలోని ఓ పాటని ఎన్టీఆర్ బయోపిక్‌లో చూపిస్తున్నారు క్రిష్. ఎన్టీఆర్‌గా బాలయ్య, సావిత్రిగా నిత్యామీనన్ ఆ పాత్రలలో ఒదిగిపోయి నటిస్తున్నారు. ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ చిత్రంలోని ‘లేచింది మహిళా లోకం’ పాట ఇప్పుడు మళ్లీ బాలయ్య నోట వినిపించనుంది.

సావిత్రి పాత్రను పోషించే అద్భుత అవకాశాన్ని ఈ సారి నిత్యామీనన్‌ని వరించింది. మహానటి పాత్రకు న్యాయం చేయడానికి నిత్య శాయశక్తులా ప్రయత్నించి ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతున్నారు. సావిత్రి బయోపిక్ ‘మహానటి’ని ఆదరించి పట్టం కట్టిన ప్రేక్షకులు ‘ఎన్టీఆర్‌’ని కూడా అక్కున చేర్చుకుంటారని నమ్ముతున్నారు చిత్ర యూనిట్.