ఎంత బిజీగా ఉన్నా ఆ ఒక్క రోజు: సుమ

365 రోజులు ఏ ఒక్క రోజైనా యాంకర్ సుమ ఖాళీగా ఉంటుందా. ఏ చానెల్‌లో చూసినా ఆమె కనిపిస్తుంది. నవ్వుతూ, నవ్విస్తూ సెటైర్లు వేస్తూ ప్రోగ్రాంని రక్తికట్టిస్తుంది. మరి అంత బిజీగా ఉండే సుమ ఆ ఒక్కరోజు మాత్రం ఓ గంట విరామం తీసుకుని ప్రజాస్వామ్యం పట్ల బాధ్యత గల పౌరురాలిగా ఓటు వేయడానికి వెళతానంటోంది. ప్రతి ఒక్కరికీ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చెబుతోంది.

ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరి జీవితం వారిది. అయితే ఓటు వేయడాన్ని కనీస కర్తవ్యంగా భావించి ఓటు హక్కుని వినియోగించుకోమంటోంది. 20 ఏళ్ల క్రితం ఓటు విలువ అంతగా తెలియక వేయలేకపోయామన్నారు. ఈసారి మాత్రం తప్పకుండా ఓటు వేస్తానంటోంది. సుమ యాంకరింగ్‌ని ఇష్టపడే అభిమానులంతా ఆమె మాటల్ని ఆచరణలో పెడతారని ఆశిస్తోంది.