ఇంట్లోకి ఆగంతకుడు అందుకే వచ్చాడు : ప్రణయ్‌ భార్య అమృత

unknown-person-entered-honor-killing-victim-house-miryalaguda

మిర్యాలగూడలో గతంలో హత్యకు గురైన ప్రణయ్‌ ఇంట్లోకి రెండు రోజుల క్రితం చొరబడ్డ నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.ఆంజనేయులు అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నామని, గతంలో ఇతనిపై చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆంజనేయులు స్వస్థలం హుజూర్‌నగర్‌ మండలం కరక్కాయలగూడెంగా గుర్తించారు.

Also read : గుండమ్మకథలో బుల్లెమ్మ.. ఎన్టీఆర్‌లో ఈ చిన్నమ్మ

3వ తేదీన తెల్లవారుజామున తమ ఇంట్లోకి ఎవరో చొరబడేందుకు యత్నించారని ప్రణయ్‌ భార్య అమృత, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనం కోసమే వచ్చాడని అమృత అభిప్రాయపడుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆంజనేయులు దొంగతనం కోసమే వచ్చినట్లు పోలీసులు చెప్పారు.