అందుకే విడాకులు తీసుకున్నా : అమీర్ ఖాన్

amir-khan-comments-divorce-reena

మనసులు కలవక, తమమధ్య అభిప్రాయబేధాలు రావడంతోనే తాము విడిపోవలసి వచ్చిందని నటుడు అమీర్ ఖాన్ తన మాజీ భార్యను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. అయితే తాము విడిపోయినప్పటికీ ఇద్దరం మంచి స్నేహితులుగానే ఉన్నామని చెప్పాడు. ఇటీవల.. కరణ్‌ జోహార్‌ చాట్‌ షోలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమిర్‌ మాట్లాడుతూ.. ‘నా మాజీ భార్య రీనా దత్తాకు విడాకులు ఇచ్చినంత మాత్రాన తనపై నాకు గౌరవం లేనట్లు కాదు. మేము విడిపోయే సమయంలో మా రెండు కుటుంబాలు కూడా చాలా బాధ పడ్డాయి. కానీ దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాక కలిసి ఉండటంలో అర్థం లేదు. ఆమెపై నాకున్న ప్రేమ, నాపై ఆమెకున్న ప్రేమ తగ్గిపోయింది. అందుకు కారణం బహుశా చాలా చిన్న వయసులోనే మాకు పెళ్లి అవ్వడం వలెనే ఇలా జరిగిందని అనుకుంటున్నాను. ఏది ఏమైనా తనతో వైవాహిక బంధానికి తెరపడినప్పటికీ, రీనాతో ఇప్పటికీ స్నేహబంధం కొనసాగుతూనే ఉంది. భార్యాభర్తలుగా విడిపోయామే కానీ స్నేహితులుగా ఎల్లప్పుడూ కలిసే ఉన్నాం, అప్పుడప్పుడు జరిగే కార్యక్రమాలు, ఫంక్షన్లలో పాల్గొంటాం, బాగానే మాట్లాడుకుంటాం, కుటుంభం క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంటాం.. అని అమిర్ ఖాన్ వెల్లడించాడు.